ఇకపై డబ్బింగ్ సినిమాలకు ఇబ్బందేనా..!
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ 19 కారణంగా ప్రపంచమంతా స్తంభించింది. పలు దేశాలు కోవిడ్ 19 నుండి బారి నుండి తప్పించుకోవడానికి లాక్డౌన్ విధానాన్ని పాటిస్తున్నాయి. అలా లాక్డౌన్ను పాటిస్తున్న దేశాల్లో మన దేశం కూడా ఉంది. మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఉంటే.. మే 7 వరకు తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను కొనసాగించనుంది. ఈ క్రమంలో దేశంలో పలు రంగాలు చాలా ఇబ్బందులతో కుంటుపడుతున్నాయి. అలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది సినీ పరిశ్రమ. ఇప్పటికే మార్చి మూడో వారం నుండి విడుదల కావాల్సిన సినిమాలు ఆగిపోయాయి. ఇంకా ఎప్పటికి విడుదలవుతాయో తెలియదు.
ఒకవేళ లాక్డౌన్ను తొలగించినా థియేటర్స్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వాలు అనుమతినిస్తాయా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఏం చేయాలని సినీ పరిశ్రమలోని పెద్దలు ఆలోచన చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఇప్పుడున్న సినిమాలకు భవిష్యత్తులో థియేటర్స్ సమస్య లేకుండా చూడాలనుకుంటున్నారట. అందుకోసం డబ్బింగ్ సినిమాలను ఇప్పట్లో విడుదల చేయకుండా నియమం పెట్టుకోవాలని ఆలోచనలు చేస్తున్నారట. దీంతో కొంత మేర థియేటర్స్ సమస్య తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. ఒకవేళ ఇది నిజమై రూల్ను పాస్ చేస్తే డబ్బింగ్ సినిమాలకు, సదరు సినిమాలను కొన్న నిర్మాతలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout