దుబ్బాక: 2009 నుంచి ఎన్నికల ఫలితాలు ఆసక్తికరమే..

  • IndiaGlitz, [Tuesday,November 10 2020]

దుబ్బాక ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి నేటి ఉప ఎన్నిక వరకూ ఆసక్తికరంగా మారుతూనే ఉన్నాయి. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే... 2009లో మొత్తం ఓట్లు 1,42,535 పోలవగా... నాడు కాంగ్రెస్ పార్టీ తరుఫున చెఱకు ముత్యం రెడ్డికి - 52,989 ఓట్లు వచ్చాయి. ముత్యంరెడ్డి 37.18 శాతం ఓట్లను కైవసం చేసుకున్నారు. అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి - సోలిపేట రామలింగా రెడ్డి - 50,349 ఓట్లను కైవసం చేసుకున్నారు. 35.32 శాతం ఓటింగ్‌ను సాధించారు.

కాగా.. 2009లో ప్రజారాజ్యం తరుఫున మద్దుల నాగేశ్వర రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నాగేశ్వరరెడ్డికి 19,942 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ 2,640 ఓట్ల మెజారిటీని సాధించింది. ఇక
2014 విషయానికి వస్తే.. మొత్తం పడిన ఓట్లు -1,52,564 కాగా.. టీఆర్ఎస్ తరుఫున పోటీ చేసిన సోలిపేట రామలింగా రెడ్డికి - 82,231 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి - చెఱకు ముత్యం రెడ్డికి - 44,306 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి - మాధవనేని రఘునందన రావుకు 15,133 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ 37,925 ఓట్ల మెజారిటీని సాధించింది.

కాగా.. 2018 ఎన్నికల ఫలితాల్లో మొత్తం 1,63,401 ఓట్లు పోలవగా.. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగా రెడ్డికి 89,299 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దుల నాగేశ్వర రెడ్డికి 26,799 ఓట్లు.. బీజేపీ అభ్యర్థికి మాధవనేని రఘునందన రావుకి 22,595 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 62,500 ఓట్ల మెజారిటీ వచ్చింది. కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి హఠాన్మరణంతో తిరిగి ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఉపఎన్నికలో బీజేపీ తరుఫున రఘునందనరావు, కాంగ్రెస్ తరుఫున సోలిపేట సుజాత, కాంగ్రెస్ తరుఫున శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. నేడు ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగుతోంది. ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగిస్తోంది. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉండగా.. అతి తక్కువ ఓట్లతో కాంగ్రెస్ కొనసాగుతోంది.

More News

షూటింగ్‌ను ప్రారంభించుకున్న ‘పుష్ప’..

అల్లు అర్జున్‌ హీరోగా ప్యాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’ రూపొందుతున్న విషయం తెలిసిందే.

అమ్మ రాజశేఖర్‌ను కొంత వరకూ మరిపిస్తున్న అరియానా..

ఓపెనింగే.. అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయినందుకు సొహైల్ ఒకవైపు, అరియానా మరోవైపు ఏడుపు సీన్..

దుబ్బాక: తొలిరౌండ్‌లో ఆధిక్యంలో బీజేపీ...

దుబ్బాక ఉపఎన్నిక ఫలితం నేడు తేలనుంది. తొలి రౌండ్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది.

దుబ్బాక కౌంటింగ్ ప్రారంభం.. పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ..

సిద్దిపేట: నేడు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైంది.

ర‌వితేజ చిత్రంలో హాట్ యాంక‌ర్‌

తెలుగు బుల్లితెర అభివృద్ధి చెందుతున్న త‌రుణంలో గ్లామ‌ర్ హంగులు అద్దిన తెలుగు యాంక‌ర్స్‌లో అన‌సూయ ముందు వ‌రుస‌లో ఉంటారు.