దుబ్బాక కౌంటింగ్ ప్రారంభం.. పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ..
Send us your feedback to audioarticles@vaarta.com
సిద్దిపేట: నేడు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైంది. సిద్దిపేట శివారు ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తి ఫలితం రానుంది. 315 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లు 1,64,192 కాగా.. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగిసింది. దుబ్బాకలో 1453 పోస్టల్ బ్యాలెట్, 51 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. దీనిలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. కౌంటింగ్ కోసం అధికారులు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.
దుబ్బాక ఉప ఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులున్నారు. దుబ్బాకలో మొత్తం 1,98,756 ఓట్లు.. 82.61 శాతం పోలింగ్ జరగనుంది. కాగా.. కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్‌తో పాటు కెమెరాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌లో 350 మంది సిబ్బంది పాల్గొననున్నారు. కోవిడ్ నిబంధనల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com