దుబ్బాక ఎన్నిక ఫలితం మరింత అప్రమత్తం చేసింది: కేటీఆర్

  • IndiaGlitz, [Tuesday,November 10 2020]

దుబ్బాక ఎన్నిక ఫలితం తమను అప్రమత్తం చేసిందని.. భవిష్యత్ కార్యాచరణ ప్రకారం తమ పని తాము చేసుకుంటూ ముందుకెళతామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్తి రఘునందన్‌రావు విజయం సాధించిన విషయం తెలిసిందే. దుబ్బాక ఫలితం తేలిన అనంతరం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. విజయాలకు పొంగిపోమని.. అపజయాలకు కుంగిపోమని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు ఓటు వేసిన ప్రజలందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

అలాగే పార్టీని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాకలో తాము ఆశించిన ఫలితం రాలేదన్నారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకు సాగుతామన్నారు. ప్రజల ఇచ్చిన తీర్పు శిరోధార్యమన్నారు. ఈ తీర్పును సమీక్షించుకుని మరింత అప్రమత్తంగా ఉంటామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

More News

ఓటమికి బాధ్యత వహిస్తా: హరీష్ రావు

దుబ్బాక ఉపఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకూ మంత్రి హరీష్‌రావు చాలా కృషి చేశారు.

ఆ విష‌యం తెలిసి షాక‌య్యాను:  ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ ప్ర‌మాదం పొంచి ఉంది కాబ‌ట్టి ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉంటూ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాంటూ విజ్జ‌ప్తి చేశారు.

బాల‌య్య హీరోయిన్ ఖ‌రారు

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ చిత్రంలో ఆయ‌న స‌ర‌స‌న న‌టించ‌బోయే హీరోయిన్ ఖ‌రారైంది.

దుబ్బాకను సొంతం చేసుకుని.. టీఆర్ఎస్‌ను చావుదెబ్బ కొట్టిన బీజేపీ

దుబ్బాక ఉపఎన్నిక.. ఆసక్తికరంగా మొదలైన కౌంటింగ్.. నరాలు తెగే ఉత్కంఠ..  రౌండ్ రౌండ్‌కూ మారిపోయిన ఆధిక్యాలు..

దుబ్బాక దంగల్‌లో హరీష్‌రావు, ఉత్తమ్‌, సీతక్కలకు షాక్..

దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 10 రౌండ్ల వరకూ బీజేపీ దాదాపుగా హవా కొనసాగిస్తూ వచ్చింది.