బాలయ్యమూవీలో దేవిశ్రీ చేయడం లేదా..?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. క్రిష్ పెళ్ళి కారణంగా గ్యాప్ తీసుకున్న ఈ యూనిట్ ఈ నెలాఖరున హైదరాబాద్, మధ్యప్రదేశ్‌ల్లో షెడ్యూల్ జరుపుకోవడానికి రెడీ అవుతుంది. అయితే ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా సాగిపోతున్న ఈ చిత్రయూనిట్‌కు ఓ చిన్న బ్రేక్ వచ్చింది. అదే దేవిశ్రీప్రసాద్. బిజీ షెడ్యూల్ కారణంగా ఈ చిత్రంలో తాను పనిచేయడానికి కుదరడం లేదని దేవి తప్పుకున్నాడని వార్లలు వినపడుతున్నాయి.
దీంతో చిత్రయూనిట్ ఇళయరాజా లేదా ఎం.ఎం.కీరవాణితో మ్యూజిక్ చేయించుకోవాలని అనుకుంటుందని చూస్తున్నారని, అయితే క్రిష్‌కు మరో ఆప్షన్ కూడా ఉంది. అతనే చిరంతన్ భట్, కంచె చిత్రానికి మ్యూజిక్ అందించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మ్యూజిక్ అందించే అవకాశాలు కనపడుతున్నాయని అంటున్నారు. బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. సంక్రాంతికి , జనవరి 12న సినిమాను విడుదల చేయాలని యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com