విలన్ గా కొత్తావతారం - డి.ఎస్.రావు
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్ తో 'ద్రోణ', నానితో 'పిల్ల జమీందార్', నిఖిల్ తో 'కళావర్ కింగ్', మంచు మనోజ్ తో 'మిస్టర్ నూకయ్య' వంటి పలు భారీ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు నటుడిగానూ బిజీ అవుతున్నారు.
ప్రముఖ దర్శకుడు తేజ తొలిసారి డి.ఎస్.రావులోని నటుడిని గుర్తించి, 'హోరాహోరీ'లో విలన్ గా అవకాశమిచ్చారు. తదుపరి నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన "కళ్యాణవైభోగం"లోనూ ముఖ్య పాత్ర పోషించి మెప్పించిన డి ఎస్.రావు నటుడిగా ఇప్పటికి 15 సినిమాలు చేశారు. ప్రస్తుతం "రంగు, నయనం, విశ్వామిత్ర, ప్రేమకథాచిత్రం-2, కల్కి, యుద్ధం చెయ్" వంటి చిత్రాలో విభిన్నమైన పాత్రలు చేస్తూ.. నటుడిగా ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టూ ఎక్కుతున్నారు.
నవంబర్ 10, తన జన్మదినం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాతగా ఇప్పటికి 20 సినిమాలు తీశాను. ప్రముఖ దర్శకుడు తేజ ప్రోత్సాహంతో నటుడిగా మారాను. తెలుగుతోపాటు కన్నడ, హిందీ భాషల్లోనూ నటిస్తున్నాను. నటుడిగా రాణిస్తూనే.. మంచి ప్రాజెక్ట్ సెట్ అయినప్పుడు ప్రొడ్యూస్ చేస్తాను. ముఖ్యంగా విలన్ గా మంచి గుర్తింపు సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout