క్రేజీ ప్రాజెక్ట్స్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్న 'దృశ్యకావ్యం' దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి

  • IndiaGlitz, [Friday,April 07 2017]

పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ ఫిలింస్‌ పతాకంపై గతంలో 'దృశ్యకావ్యం' వంటి చిత్రాన్ని అందించిన దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి పుట్టినరోజు ఈరోజు(ఏప్రిల్‌ 7). ఈ సందర్భంగా ఆయన తను చేయబోయే కొత్త ప్రాజెక్ట్‌ల వివరములను తెలియజేశారు.

ఆయన మాట్లాడుతూ..' తమిళంలో విజయ్‌, కీర్తీ సురేష్‌ జంటగా భరతన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'భైరవ' చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేయనున్నాము. సంతోష్‌ నారాయన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం మే లో రిలీజవుతుంది. అలాగే రాజ్‌తరుణ్‌, జై, అంజలి, జెన్నీ అయ్యర్‌ హీరో హీరోయిన్లుగా శనీష్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో 'బెలూన్‌' అనే చిత్రం ప్రస్తుతం కోడైకెనాల్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జూలై ఎండింగ్‌కి రిలీజ్‌ చేయనున్నాము. అలాగే విక్రమ్‌, నయనతార హీరో హీరోయిన్లు గా డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న 'సామి 2' చిత్రాన్ని ఈ ఇయర్‌ ఎండింగ్‌ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నాము. మహేష్‌ గోవిందరాజు సమర్పణలో పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రాలు ఈ ఇయర్‌లో తెలుగు ప్రేక్షకులను అలరిస్తాయని ఆశిస్తున్నాము...అన్నారు.