సమంత విడుదల చేసిన దృష్టి ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల రాక్షసి, అలా ఎలా సినిమాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న రాహుల్ రవీంద్రన్ కథానాయకుడిగా, ఎమ్ స్వేర్ బ్యానర్ పై రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దృష్టి. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ప్రముఖ సినీ హీరోయిన్ సమంత చేతుల మీదుగా విడుదల అయింది.
ఈ సందర్భంగా, దర్శకనిర్మాతలు మాట్లాడుతూ, సమంతతో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయించడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. రాహుల్ ను ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూడనున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
రాహుల్ రవీంద్రన్ హీరోగా, పవని గంగి రెడ్డి హీరోయిన్లుగా పనిచేస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య ప్రకాష్, రవి వర్మ, ప్రమోదిని.. తదితరులు నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments