మద్యం మత్తులో కండక్టర్‌పై యువతి దాడి.. ఆర్టీసీ యాజమాన్యం ఆగ్రహం..
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లో ఓ యువతి ఆర్టీసీ బస్సులో హల్‌చల్ చేసింది. హయత్‌నగర్ బస్ డిపో-1కు చెందిన బస్సు హయత్ నగర్ నుంచి అప్జల్ గంజ్ బయల్దేరింది. హయత్‌నగర్ బస్టాప్‌లో ఓ యువతి మద్యం మత్తులో బస్సు ఎక్కింది. టికెట్ కోసం ఐదు వందల రూపాయల నోటు ఇచ్చింది. చిల్లర లేదని కండక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా తిట్ల దండకం అందుకుంది. విధుల్లో ఉన్న కండక్టర్‌ను కాలితో తన్నుతూ పచ్చి బూతులు తిడుతూ నానా రచ్చ చేసింది. తోటి ప్రయాణికులు వారించినా వారి పైన దాడి చేసేందుకు యత్నించింది. మర్డర్ చేస్తా అంటూ బెదిరించింది.
తాను లోకల్ అని.. నీ సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో యువతిపై ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె బెదిరింపులను ప్రయాణికులు ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యువతి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. మొదటి ట్రిప్పులో తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ విన్నవించినా ఆ యువతి ఏ మాత్రం వినకుండా దాడికి పాల్పడిందన్నారు. ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించినా.. దాడులకు పాల్పడినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు యువతిని అరెస్ట్ చేసి శిక్షించాలని ఆర్టీసీ యాజమాన్యం డిమాండ్ చేస్తోంది. ప్రతి రోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నామని.. అలాంటి సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంది. ఇటీవల కాలంలో ఆర్టీసీ సిబ్బందిపై మహిళల దాడులు ఎక్కువైపోయాయని.. ఇక నుంచి దాడులకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ప్రభుత్వం బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలిపించడంతో బస్సు ప్రయాణం చేసే మహిళలు ఎక్కువయ్యారు. జీరో టికెట్ విషయంలో కండక్టర్లపై గొడవకు దిగుతున్నారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. ఇకపై ఎవరైనా సరే సిబ్బందితో హద్దులు మీరి ప్రవర్తిస్తే పోలీసు కేసులు నమోదుకు రెడీ అయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com