రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దాదాపు రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వంద కిలోల హెరాయిన్, కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ముఠా నుంచి ఆయుధాలను సైతం అధికారులు స్వాధీనం చేసకున్నారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను సముద్ర మార్గం నుంచి తమిళనాడుకు డ్రగ్స్ ముఠా తరలించింది.
హైదరాబాద్‌లో ఇటీవల భారీ డ్రగ్స్ రాకెట్ బయటపడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు రూ.100 కోట్ల విలువైన 501 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి ముంబైకి భారీగా మెఫిడ్రోన్స్ డ్రగ్స్ లోడుతో వెళ్తున్న ప్రయాణికులు లేని ప్రైవేటు ప్యాసింజర్ బస్సును డీఆర్‌ఐ అధికారులు వెంటాడి మరీ ముంబైలో పట్టుకున్నారు. అక్కడి లేబొరేటరీ నుంచి భారీగా మెఫిడ్రోన్, కెటమైన్, ఎఫిడ్రిన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout