డ్రగ్స్ కేసులో రియా సంచలనం.. టాలీవుడ్ సహా 3 ఇండస్ట్రీల్లో షేక్..
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పరోక్షంగా మూడు ఇండస్ట్రీలను షేక్ చేస్తోంది. ఈ కేసును కేంద్రం సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఇంకేముంది.. రంగంలోకి దిగిన సీబీఐ అన్ని కోణాల్లో విచారణ నిర్వహించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి విచారణలో డ్రగ్స్ కోణం వెలుగు చూసింది. దీని ఆధారంగా ఆమె కాల్ డేటాతో పాటు వాట్సాప్ చాట్‌లను కూడా సీబీఐ పరిశీలించింది. దీంతో రియా డ్రగ్ మాఫిమాతో నడిపిన చాటింగ్ వ్యవహారమంతా బట్టబయలైంది. అక్కడి నుంచి కేసు మరో టర్న్ తీసుకుంది.
డ్రగ్స్ మాఫియాతో సంబంధాల వ్యవహారంలో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని మూడు రోజుల పాటు విచారించగా.. 25 మంది బాలీవుడ్‌తో పాటు మరో ఇండస్ట్రీలకు చెందిన అగ్రతారలు డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడైంది. అప్పటి నుంచి ఈ అగ్రతారలెవరనే విషయమై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇదంతా పక్కనబెడితే అప్పుడెప్పుడో అకున్ సబర్వాల్ నేతృత్వంలో కొద్ది రోజుల పాటు సెన్సేషన్ సృష్టించి.. అంతే సెన్సేషన్‌గా సద్దుమణిగిన టాలీవుడ్ డ్రగ్స్ బాగోతం.. ఇప్పుడు బాలీవుడ్‌లో తీగ లాగితే.. కదులుతున్న డొంకలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం. ఇంతకూ ఆ టాలీవుడ్ అగ్రతారలెవరనేది చర్చనీయాంశంగా మారింది.
డ్రగ్స్ పార్టీల కోసం సుశాంత్ ఫామ్ హౌస్..
బాలీవుడ్, శాండిల్‌వుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఎన్‌సీబీ జాబితాలో హీరో, హీరోయిన్లతో పాటు... సినిమా రంగానికి చెందిన పలువురి పేర్లు వెలుగు చూస్తున్నాయి. జాబితా ఆధారంగా విచారించేందుకు ఎన్‌సీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్‌సీబీ జాబితాలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ పేరు కూడా ఉండటం గమనార్హం. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే బాలీవుడ్‌లో రియాతో పాటు... శాండిల్‌వుడ్‌లో రాగిణి ద్వివేది, సంజన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఎన్సీబీ విచారణలో.. సుశాంత్ ఫాంహౌస్‌ను బాలీవుడ్‌లో చాలా మంది డ్రగ్స్ పార్టీల కోసం వాడుకునే వారంటూ రియా సంచలన విషయాలు బయటపెట్టింది. లోనావాలాలోని ఫాంహౌస్‌కు ఎవరెవరు వచ్చేవారో...పేర్లతో సహా రియా బయట పెట్టినట్టు తెలుస్తోంది. కొకైన్, ఎల్‌ఎస్‌డీ, మర్జువానా పార్టీల్లో విచ్చలవిడిగా వారని చెప్పిన రియా వెల్లడించింది. బాలీవుడ్‌లో ఇద్దరు బడా హీరోల పేర్లు బయటపెట్టిందని ఊహాగానాలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com