crocodile Attack: వెంటాడిన మొసళ్లు.. చిన్నారి సాహసం, ఆన్‌లైన్‌ని షేక్ చేస్తోన్న వీడియో

  • IndiaGlitz, [Saturday,August 27 2022]

నీటిలో మొసలికి బలం ఎక్కువగా వుంటుందంటారు పెద్దలు. నీటిలో వుంటే భారీ ఏనుగునైనా ఖతం చేస్తుంది. అంత పవర్ ఫుల్ .. మరి మనుషులు దొరికితే కరకర నమిలి మింగేస్తుంది. ఎంతపెద్ద పోటుగాడైన మొసలికి నీళ్లలో చిక్కితే ఏమైనా వుందా...? దానికి ఆహారమవ్వాల్సిందే తప్ప తప్పించుకోవడం అసాధ్యం. అలాంటిది కొన్ని మొసళ్ల గుంపుకి చిక్కిన ఓ బాలుడు... తన ప్రాణాలను కాపాడుకోవడానికి చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చుట్టూ మొసళ్లు.. అయినా చెక్కుచెదరని ధైర్యం:

వివరాల్లోకి వెళితే... చంబల్ నదిలో మొసళ్లు ఎక్కువగా వుండే ప్రాంతంలో ప్రమాదవశాత్తూ పడిపోయాడో బాలుడు. అంతే ఓ మొసలి అతనికి దగ్గరగా వచ్చింది. ఓ వైపు నదీ ప్రవాహం, వెనుక మొసలి ఇక తన అంతిమ ఘడియలు సమీపించాయని అనుకున్నాడు. కానీ అలాగే నీటిలో ఈదుకుంటూ వెళ్లాడు. అదే సమయంలో అతనిని మరికొన్ని మొసళ్లు చుట్టుముట్టాయి. అయినప్పటికీ ధైర్యంగా ముందుకే సాగాడు. సరిగ్గా ఇదే సమయంలో ఓ పడవలో వెళ్తున్న కొందరు ఆ బాలుడిని గుర్తించి, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వచ్చి రక్షించారు. ఏమాత్రం ఆలస్యమైనా ఆ మొసళ్లు ఆ బాలుడి శరీరాన్ని చీల్చి పంచుకుని తినేసేవి. ఇందుకు సంబంధించిన వీడియో ఐఆర్ఎస్ అధికారి భగీరథ్ చౌదరి ట్వీట్ చేశారు. కాసేటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత క్లిష్ట పరిస్ధితుల్లో వున్నా బాలుడు చూపిన ధైర్యం, అతనిని రక్షించిన రెస్క్యూ బృందాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

More News

Nitin - J. P. Nadda Meet : హీరో నితిన్‌తో భేటీకానున్న జేపీ నడ్డా.. అంతుచిక్కని బీజేపీ వ్యూహం

తెలంగాణలో అధికారం అందుకోవడంతో పాటు ఏపీలోనూ బలపడాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది బీజేపీ.

Sai Vila: దర్శకుడు బి.గోపాల్ క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన సాయి విలా సినిమాస్ ప్రొడక్షన్ నెం 2

ఒక మధ్య తరగతి ప్రేమజంటకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని మంచి ప్లాన్ తో చేజిక్కుంచుకొని కోటేశ్వరులు ఎలా అయ్యారు?

Charmy Kaur : లైగర్ ఫ్లాప్, ఛార్మీ మీద పగ తీర్చుకుంటోన్న మెగా ఫ్యాన్స్.. మరీ ఈ రేంజ్ ట్రోలింగా..?

యూత్‌లో మంచి క్రేజ్ వున్న విజయ్ దేవరకొండ, ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత మంచి ఊపు మీదున్న పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడిన గులాం నబీ ఆజాద్, వెళ్తూ వెళ్తూ రాహుల్‌పై విమర్శలు

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి.

Janasena : 'నా సేన కోసం నా వంతు'ని ప్రారంభించిన నాగబాబు.. యూపీఐ ద్వారా సింపుల్‌గా విరాళాలివ్వొచ్చు

కుల, మతాలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తోన్న జనసేనకు అండగా నిలిచేందుకు 'నా సేన కోసం నా వంతు' కార్యక్రమాన్ని ప్రారంభించారు