crocodile Attack: వెంటాడిన మొసళ్లు.. చిన్నారి సాహసం, ఆన్‌లైన్‌ని షేక్ చేస్తోన్న వీడియో
- IndiaGlitz, [Saturday,August 27 2022]
నీటిలో మొసలికి బలం ఎక్కువగా వుంటుందంటారు పెద్దలు. నీటిలో వుంటే భారీ ఏనుగునైనా ఖతం చేస్తుంది. అంత పవర్ ఫుల్ .. మరి మనుషులు దొరికితే కరకర నమిలి మింగేస్తుంది. ఎంతపెద్ద పోటుగాడైన మొసలికి నీళ్లలో చిక్కితే ఏమైనా వుందా...? దానికి ఆహారమవ్వాల్సిందే తప్ప తప్పించుకోవడం అసాధ్యం. అలాంటిది కొన్ని మొసళ్ల గుంపుకి చిక్కిన ఓ బాలుడు... తన ప్రాణాలను కాపాడుకోవడానికి చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చుట్టూ మొసళ్లు.. అయినా చెక్కుచెదరని ధైర్యం:
వివరాల్లోకి వెళితే... చంబల్ నదిలో మొసళ్లు ఎక్కువగా వుండే ప్రాంతంలో ప్రమాదవశాత్తూ పడిపోయాడో బాలుడు. అంతే ఓ మొసలి అతనికి దగ్గరగా వచ్చింది. ఓ వైపు నదీ ప్రవాహం, వెనుక మొసలి ఇక తన అంతిమ ఘడియలు సమీపించాయని అనుకున్నాడు. కానీ అలాగే నీటిలో ఈదుకుంటూ వెళ్లాడు. అదే సమయంలో అతనిని మరికొన్ని మొసళ్లు చుట్టుముట్టాయి. అయినప్పటికీ ధైర్యంగా ముందుకే సాగాడు. సరిగ్గా ఇదే సమయంలో ఓ పడవలో వెళ్తున్న కొందరు ఆ బాలుడిని గుర్తించి, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వచ్చి రక్షించారు. ఏమాత్రం ఆలస్యమైనా ఆ మొసళ్లు ఆ బాలుడి శరీరాన్ని చీల్చి పంచుకుని తినేసేవి. ఇందుకు సంబంధించిన వీడియో ఐఆర్ఎస్ అధికారి భగీరథ్ చౌదరి ట్వీట్ చేశారు. కాసేటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యంత క్లిష్ట పరిస్ధితుల్లో వున్నా బాలుడు చూపిన ధైర్యం, అతనిని రక్షించిన రెస్క్యూ బృందాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
This is real heroic deed. Chambal river, crocodiles and the fighter kid. Salute to the rescue team. #Chambal pic.twitter.com/MvNVLV5pVy
— Dr Bhageerath Choudhary IRS (@DrBhageerathIRS) August 24, 2022