ఆన్‌లైన్ కోర్సు నేర్చుకుంటోన్న డైరెక్ట‌ర్ తేజ‌

  • IndiaGlitz, [Friday,May 01 2020]

లాక్‌డౌన్ స‌మ‌యంలో అంద‌రూ స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అదే స‌మయంలో దొరికిన ఖాళీ స‌మ‌యాన్ని ఎవ‌రు తోచిన‌ట్లు వారు ఉప‌యోగించుకుంటున్నారు. ఇంటి ప‌నులు, వంట ప‌నులు చేయ‌డంతో పాటు కొత్త విష‌యాల‌ను నేర్చుకునే బిజీలో ఉన్నారు సినీ సెల‌బ్రిటీలు. అదే కోవ‌లో డైరెక్ట‌ర్ తేజ కొత్త విష‌యాన్ని నేర్చ‌కుంటున్నార‌ట అదేంటో తెలుసా? డైరెక్ట‌ర్ తేజ ఓ ఆన్‌లైన్ కోర్సును నేర్చుకుంటున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇంత‌కు తేజ నేర్చుకుంటున్న ఆన్‌లైన్ కోర్సు ఎందుకో తెలుసా? ఊపిరితిత్తుల వ్యాధుల‌కు సంబంధించిన కోర్సు. క‌రోనాలాంటి వ్యాధులు సోకిన స‌మ‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌చ్చునో ఈ ఆన్‌లైన్ కోర్సులో నేర్చుకుంటున్నార‌ట తేజ‌.

వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ (డ‌బ్ల్యు.హెచ్‌.ఓ) ఈ ఆన్‌లైన్ కోర్సును అభ్య‌సిస్తున్నాడ‌ట‌. వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ ఒప్పుకుంటే తాను వాలంటీర్‌గా ప‌నిచేయ‌డానికి కూడా సిద్ధ‌మేన‌ని ఈ సంద‌ర్భంగా ఇంట‌ర్వ్యూలో తేజ తెలియ‌జేశారు. సీత త‌ర్వాత తేజ రెండు సినిమాల‌ను ఓకే చేశారు. గోపీచంద్‌, రానాల‌తో ఈ రెండు సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నారీయ‌న‌. ఆ చిత్రాల‌కు ఆలివేల మంగ వెంక‌టర‌మ‌ణ‌, రాక్ష‌స‌రాజు రావ‌ణాసురుడు అనే టైటిల్స్‌ను ఖ‌రారు చేశారు. ఇదే కాకుండా రెండు వెబ్ సిరీస్‌ల‌ను కూడా తెర‌కెక్కించ‌డానికి ప్లాన్స్ చేస్తున్నార‌ని స‌మాచారం.