జూలై 7న డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్ టైన్ మెంట్ 'రాక్షసి'
- IndiaGlitz, [Tuesday,June 27 2017]
పూర్ణ ప్రధాన పాత్రలో డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పన్నా రాయల్ దర్శకత్వంలో 'కాలింగ్ బెల్' చిత్రానికి సీక్వెల్‌గా అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ జన్ను నిర్మిస్తున్న హార్రర్ ఎంటర్‌టైనర్ 'రాక్షసి'. ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ - ''ఇందులో నేను చేసిన క్యారెక్టర్ చాలా కొత్తగా వుంటుంది. ఈ సినిమాలో రాక్షసి ఎవరు అనే సస్పెన్స్‌ని చివరి వరకు బాగా మెయిన్‌టెయిన్ అవుతుంది. పన్నా రాయల్ సినిమాని చాలా ఇంట్రెస్టింగ్‌గా తీశారు. నిర్మాతలు అశోక్, రాజు, టోనీ కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నా కెరీర్‌లో ఇది మరో బెస్ట్ మూవీ అవుతుంది'' అన్నారు.
అభిమన్యు సింగ్ మాట్లాడుతూ - ''నేను ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ ఇది. కథ వినగానే నాకు బాగా నచ్చింది. నా క్యారెక్టర్ ఇంకా బాగా నచ్చింది. డైరెక్టర్ పన్నా కథ చెప్పిన దానికంటే బాగా తీశాడు. ఆడియన్స్‌ని హండ్రెడ్ పర్సెంట్ థ్రిల్ చేసే సినిమా ఇది'' అన్నారు.
దర్శకుడు పన్నా రాయల్ మాట్లాడుతూ - ''కాలింగ్‌బెల్ సక్సెస్ అయి నాకు ఎంతో మంచి పేరు తెచ్చింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన 'రాక్షసి' టెక్నికల్‌గా, విజువల్‌గా చాలా హై రేంజ్‌లో వుంటుంది. ఆడియన్స్ థ్రిల్ అయ్యే ఎలిమెంట్స్ సినిమాలో చాలా వున్నాయి. యాజమాన్య మంచి సాంగ్స్ ఇచ్చారు. తన రీరికార్డింగ్‌తో సినిమాని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్ళాడు. మా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా సినిమాని చాలా రిచ్‌గా నిర్మించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయి మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
నిర్మాత అశోక్ మందా మాట్లాడుతూ - ''మా బేనర్‌లో వస్తోన్న మొదటి సినిమా ఇది. సినిమా క్వాలిటీగా వుండాలి, ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా వుండాలన్న ఉద్దేశంతో నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. దానికి తగ్గట్టుగానే పన్నా రాయల్ టేకింగ్ కూడా చాలా ఎక్స్‌లెంట్‌గా వుంది. భారీ చిత్రాల్లో విజువల్స్ ఎలా వుంటాయో ఆ తరహాలో ప్రతి సీన్ ఎంతో రిచ్‌గా వుంటుంది. హార్రర్ చిత్రాల్లో ఇదో విభిన్నంగా వుండే సినిమా. జూలై 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుంది'' అన్నారు.
పూర్ణ, అభిమన్యుసింగ్, అభినవ్ సర్ధార్, గీతాంజలి, ప థ్వీ, బేబీ ధ్వని, బేబీ క తిక, తాగుబోతు రమేష్, ప్రభాస్ శ్రీను, 'ఛత్రపతి' శేఖర్, 'ఈరోజుల్లో' సాయి, షాని సాల్మన్, ఫణి, ప్రియ, సమ్మెట గాంధీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, సినిమాటోగ్రఫీ: కర్ణ ప్యారసాని, ఎడిటింగ్: శ్రీసంతోష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సాల్మన్, నిర్మాతలు: అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ జన్ను, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్.