ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' అందర్నీ ధ్రిల్ చేస్తుంది - నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'శ్రీమంతుడు', 'నాన్నకు ప్రేమతో', 'సుప్రీమ్స తదితర సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్‌ని కొనసాగిస్తున్న నవ్వుల రారాజు నటకిరీటి డా . రాజేంద్రప్రసాద్. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని డిఫరెంట్ క్యారెక్టర్స్‌ని సెలక్ట్ చేసుకుంటూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటిస్తున్నారు రాజేంద్రప్రసాద్. నలభై ఏళ్ల సినీ కెరీర్లో కమెడియన్‌గా, హీరోగా ఎన్నో మంచి పాత్రల్ని పోషించి ప్రైమ్ మినిస్టర్ దగ్గర్నుండి కామన్ ఆడియన్ వరకు అందరిచే శభాష్ అనిపించుకుని తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు ఆయన. 'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాషి' వంటి చిత్రాల్లో నటించి ప్రభుత్వ అవార్డులను సొంతం చేసుకున్నారు.
ఓపక్క 'మా' అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా తనవంతు బాధ్యతల్ని నిర్వహిస్తూ కళాకారులందరికీ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. పేద కళాకారులందరికీ ఎంతో సేవ చేస్తూ అందరి అభినందనల్ని అందుకుంటున్నారు. ప్రతి చిత్రంలోనూ ఓ ముఖ్య పాత్రని పోషిస్తూ ఎంతో పాపులారిటీని, క్రేజ్‌ని సంపాదించుకుంటున్నారు రాజేంద్రప్రసాద్. తాజాగా ఆయన 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నటకిరీటి డా|| రాజేంద్రప్రసాద్ చిత్ర విశేషాలను తెలియచేశారు.
నవ్విస్తూనే భయపెడుతుంది..!
నటకిరీటి డా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ....ఇంట్లో దెయ్యం నాకేం భయం చిత్రంలో హీరోగా సమానంగా ఉండే ఓ ముఖ్య పాత్రలో నటించాను. ఇంటి ఓనర్‌గా నటించాను. ఆ ఇంట్లో ఉండే దెయ్యం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది మెయిన్ కథాంశం. సినిమా అంతా ఫుల్ కామెడీతో రన్ అవుతుంది. ఇప్పుడున్న డిమానిటైజేషన్లో కూడా ప్రేక్షకుల్ని ఈ చిత్రం ఎంటర్టైన్ చేస్తుంది. నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. 'మా అల్లుడు వెరీగుడ్' చిత్రం తర్వాత నరేష్‌తో కలిసి ఈ చిత్రంలో నటించాను. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో చేసిన నా సినిమాలన్నీ సక్సెస్ అయి నాకెంతో పేరు తెచ్చిపెట్టాయి. ఆ చిత్రాలు షూటింగ్ జరుగుతున్నప్పుడు నరేష్ చిన్నపిల్లోడు. ప్రతిరోజూ షూటింగ్‌కి వచ్చి చూసేవాడు. సినిమా అంటే ఎంతో ప్యాషన్. అతను హీరో అయి మంచి చిత్రాలు చేస్తూ తనకంటూ సపరేట్ ట్రాక్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు తనలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. కామెడీ సన్నివేశాల్లో నటించేటప్పుడు ప్రతి సీన్ గురించి అడిగి తెలుసుకునే వాడు. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అన్నీ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. భయపెడుతూనే ప్రేక్షకుల్ని నవ్విస్తాం. అంత హిలేరియస్‌గా ఈ సినిమా ఉంటుంది.
ప్రసాద్‌గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్‌గారు నాతో కొన్ని సినిమాలు తీశారు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన నిర్మించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో నటించే అవకాశం కలిగింది. 2016లో సంక్రాంతికి రిలీజ్ అయిన ఆ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఆ చిత్రంతో 2016 సంవత్సరం స్టార్ట్ అయి 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రంతో ఈ ఇయర్ ఎండ్ అవడం చాలా హ్యాపీగా ఉంది. అప్పటికీ ఇప్పటికీ ప్రసాద్‌గారిలో ఏ మార్పు లేదు. సినిమాని ప్రేమించి ఇష్టపడి తీస్తుంటారు. ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా పెద్ద చిత్రానికి తగ్గట్టుగానే నిర్మించారు. మంచి టేస్ట్ ఉన్న నిర్మాత ఆయన. ఈ చిత్రంలో 400 అడుగుల ఎత్తు నుండి దూకే సన్నివేశం ఒకటుంది. రోప్ లేకుండా 30 అడుగుల ఎత్తులో దూకాను. ఈ వయసులో ఇంత అవసరమా అని అందరూ తిట్టారు. సినిమా బాగా రావడానికి మనవంతు కష్టపడాలి అనేది నా కోరిక. ఈ చిత్రంలో ప్రతిఒక్కరూ తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. సినిమా అంతా ఫుల్‌లెంగ్త్ ఎంటర్టైనర్గా ఉంటుంది. ప్రస్తుతం హర్రర్ చిత్రాలు బాగా ఆడుతున్నాయి. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది.
రచయితలు, దర్శకులకు నా కృతజ్ఞతలు..!
నా నలభై సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్‌తో ఇంకా యాక్టివ్‌గా పని చేయగలుగుతున్నానంటే దానికి కారణం రచయితలు, దర్శకులు. ఎన్నో మరపురాని, మర్చిపోలేని క్యారెక్టర్స్‌ను రాసిన రచయితలు, దర్శకులకు నా కృతజ్ఞతలు. అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తున్న నిర్మాతలు, తోటి నటీనటులందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ అందరితో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక 'లవ్లీ'తో దర్శకురాలు జయ నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. అక్కడి నుండి త్రివిక్రమ్, సుకుమార్, అనిల్ రావిపూడి, కృష్ణవంశీ, శ్రీను వైట్ల అందరూ కొత్త కొత్త క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. వారంతా నన్ను అభిమానించే ఫ్యాన్స్ కావడం నా అదృష్టం.
నా లైఫ్‌లో ఏదీ ప్లాన్ చేయలేదు..!
వచ్చిన అవకాశాలే నటుడ్ని పెంచుతుంది. నాకు వచ్చిన అవకాశాన్ని ఏదీ వదులుకోలేదు. నా లైఫ్‌లో ఏదీ ప్లాన్ చేసుకోలేదు. వచ్చిన అవకాశాల్ని చేసుకుంటూ వెళ్లాను. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను. ఒక యాక్టర్‌గా సక్సెస్ అయ్యాను. 'రాంబంటు', 'మేడం' చిత్రాలతో నిర్మాతగా అట్టర్‌ఫ్లాప్ అయ్యాను. కానీ డైరెక్షన్ అనేది హైలీ రెస్పాన్స్‌బిలిటీ ఉన్న పోస్ట్. సమ్‌ధింగ్ స్పెషల్. ఆ క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయి అనుకున్న రోజున డైరెక్షన్ చేస్తాను. సినిమా అనేది నాకు ఇష్టం, ప్యాషన్. అందుకే రెమ్యూనరేషన్‌కి అతీతంగా సినిమాలు చేస్తున్నాను. సక్సెస్ వస్తే పెంచడం, ఫెయిల్యూర్ వస్తే తగ్గించడం అలాంటివి నా కెరీర్లో లేవు. ఎప్పుడూ ఒకేలా చేసుకుంటూ వెళ్తున్నాను.
కొత్త నటీనటులు రావాలి..!
ప్రస్తుతం ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త వారు వస్తున్నారు, రావాలి. ఎవరు వచ్చినా కొత్తగా చేసి వాళ్లకంటూ ఓన్ బ్రాండ్ సృష్టించుకోవాలి. జీవితం అనేది ఎక్కడా ఆగదు. అలాంటి నమ్మకాలు నాకు లేవు. 2017లో నెంబరాఫ్ ఫిలింస్ చేస్తున్నాను. 'క్విక్‌గన్ మురగన్-2' హాలీవుడ్ చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయింది. ఆనంద్ సురాపూర్ దర్శకత్వం వహిస్తున్నారు అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments