చిన్న సినిమాల నెత్తిన పాలు పోసిన ‘‘ఆర్ఆర్ఆర్’’.. సంక్రాంతి బరిలో రాజశేఖర్ ‘‘శేఖర్’’..?
Send us your feedback to audioarticles@vaarta.com
యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమా 'శేఖర్'. ‘‘గరుడవేగ’’.. ‘‘ కల్కి’’ సినిమాలతో తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన రాజశేఖర్ మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించారు. ఈ క్రమంలోనే ఈయన నటిస్తున్న 91వ చిత్రం శేఖర్. దీనికి ఆయన జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘‘జోసెఫ్’’కు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ‘‘శేఖర్’’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, తనికెళ్ళ భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌కే మంచి రెస్పాన్స్ వచ్చింది.
తొలుత ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించారు. పలు ఓటీటీ సంస్థల నుంచి ‘‘శేఖర్’’కు ఫ్యాన్సీ ఆఫర్లు కూడా అందినట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయి సినిమాలు రిలీజ్‌కు రెడీగా వుండటం.. థియేటర్ల సమస్యలు, దేశంలో ఒమిక్రాన్ తీవ్రత నేపథ్యంలో చిత్ర యూనిట్ కూడా ఓటీటీ రిలీజ్ వైపు మొగ్గు చూపినట్లుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా 'శేఖర్' మూవీని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
కొన్నిరోజుల కిందట పరిస్థితి చూస్తే... సంక్రాంతికి పెద్ద సినిమాలు సందడి చేస్తాయని అనిపించింది. అందుకు తగ్గట్టుగానే 'ఆర్ఆర్ఆర్' మేకర్స్ ప్రమోషన్లతో హోరెత్తించారు. జనవరి 7న సినిమా రిలీజ్ కావాల్సి వున్న సమయంలో.. ఒమిక్రాన్ దెబ్బకు పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేస్తుండడంతో 'ఆర్ఆర్ఆర్' సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. అటు రాధేశ్యామ్ చిత్ర యూనిట్ మాత్రం తాము విడుదల చేస్తామని చెబుతున్నా పూర్తి స్థాయిలో అనిశ్చితి తొలగిపోలేదు. దీంతో ఈ పరిణామాలు చిన్న సినిమాలకు వరంగా మారాయి.
ఈ నేపథ్యంలోనే డాక్టర్ రాజశేఖర్ నటించిన 'శేఖర్' సంక్రాంతి బరిలో విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. రానున్న రెండు వారాల్లో పెద్ద చిత్రాలేవీ లేకపోతే, 'శేఖర్'కు థియేటర్ల సమస్య తొలగిపోనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే 'శేఖర్' రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫిషీయల్‌గా అనౌన్స్ చేస్తారని ఫిలింనగర్ టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com