ప్రీ లుక్‌తో మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన విల‌క్ష‌ణ న‌టుడు డా.రాజ‌శేఖ‌ర్‌

  • IndiaGlitz, [Wednesday,August 22 2018]

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విలక్ష‌ణ న‌టుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా అ! ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న త‌న చిత్రానికి సంబందించిన ప్రీ లుక్‌ను విడుద‌ల చేశారు. 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ ఫిలిం ఇది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో సినిమా తెర‌కెక్క‌నుంది.

రాజ‌శేఖ‌ర్ సినిమా ప్రీ లుక్‌లో 1983లో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ పోస్ట‌ర్‌తో చిరంజీవికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదే ఏడాది ఇండియా క్రికెట్‌లో వ‌ర‌ల్డ్‌క‌ప్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌ను కూడా ఈ పోస్ట‌ర్‌లో చూపించారు.

అ! వంటి వైవిధ్య‌మైన చిత్రంతో తెలుగు ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌శేఖ‌ర్ సినిమా చేస్తుండ‌టం సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతుంది.
ఆగ‌స్ట్ 26న రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌, ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు

https://igimage.indiaglitz.com/telugu/home/rajasekhar220818_2m.jpg

More News

కుంగ్‌ఫూ చిత్రంలో ప్ర‌భుదేవా...

ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా డైరెక్ష‌న్‌కే ప‌రిమిత‌మైయారు. అయితే ఈ మ‌ధ్య మ‌ళ్లీ ఆయ‌న న‌టుడిగా మ‌ళ్లీ బిజీ కావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

చిన్న సినిమాల‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ రాయితీలు

ఏపీ ఫిలిమ్ డెవ‌ల‌ప్ మెంట్ ఛైర్మ‌న్ అంబికా కృష్ణ  సినిమాల నిర్మాణానికి సంబంధించి కొన్ని రాయితీలు ప్ర‌క‌టించారు.

త‌మిళంలోకి నారా రోహిత్‌

కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ వ‌చ్చిన క‌థానాయ‌కుడు నారా రోహిత్‌.. ఆట‌గాళ్ళు చిత్రంతో ఈ శుక్ర‌వారం ప‌ల‌క‌రించబోతున్నాడు.

మ‌హేశ్ తల్లి పాత్ర‌లో...

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టిస్తున్న 25 చిత్రం 'మ‌హ‌ర్షి'.

సోనాక్షి కి ఇదే తొలిసారి

ద‌బాంగ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సిన్హా న‌టిగా తొమ్మిదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంది.