చంద్రబాబునాయుడు పాత్రలో డా.రాజశేఖర్?
Send us your feedback to audioarticles@vaarta.com
మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను ‘యన్.టి.ఆర్.’ పేరుతో వెండితెరపై ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నిర్మిస్తూ, ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా.. అతిరథ మహారధుల సమక్షంలో లాంచింగ్ కూడా చేశారు. లాంచింగ్ రోజున చిత్రీకరించిన షెడ్యూల్‌లో ‘దాన వీర శూర కర్ణ’లో ఎన్టీఆర్ పోషించిన దుర్యోధనుడి పాత్రను బాలకృష్ణ పోషించగా.. ఆ సన్నివేశాలను చిత్రీకరించారు.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ బయోపిక్ అంటే.. ఆయన అల్లుడు, ప్రస్తుత ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాత్ర కూడా ఉంటుంది. ఈ పాత్రను ఎవరి చేత చేయించాలని తర్జనభర్జనలు పడుతున్న సమయంలో.. సీనియర్ నటుడు డా.రాజశేఖర్ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ‘గరుడవేగ’తో విజయాన్ని అందుకున్న ఈ నటుడు.. ‘గరుడవేగ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం వస్తే చిన్న పాత్ర అయినా చేయాలని ఉందని అడగ్గా.. చిన్న పాత్ర ఎందుకు? ఇద్దరం కలిసి మల్టీస్టారర్ మూవీ చేద్దాం అంటూ బాలయ్య సమాధానం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది కార్యరూపం దాల్చే దిశగా అడుగులు పడుతున్నాయి.
ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రను రాజశేఖర్ చేత చేయించే ఆలోచనలో బాలయ్య ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రాజశేఖర్ పోషించబోయే పాత్రపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అన్నట్టు.. ఈ మూవీ లాంచింగ్‌కు రాజశేఖర్ కూడా హాజరైన విషయం విదితమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments