close
Choose your channels

‘శేఖర్’ సినిమా ప్రదర్శన నిలిపివేత.. కుట్రలు చేసి అడ్డుకున్నారు, ఎంతో కష్టపడ్డాం: రాజశేఖర్ సంచలన పోస్ట్

Sunday, May 22, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం శేఖర్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌తో నడుస్తోంది. జీవిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ఆత్మీయ రాజన్, ముస్కాన్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా నటించడం విశేషం. అయితే, రాజశేఖర్ నేడు సంచలన ప్రకటన చేశారు. తన శేఖర్ చిత్రానికి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేసి, చిత్ర ప్రదర్శనను నిలిపివేయించారని ఆరోపించారు. సినిమాయే తమకు లోకమని, ముఖ్యంగా ఈ శేఖర్ చిత్రంపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా.. ‘శేఖర్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదివారం చిత్ర యూనిట్‌ను ఆదేశించింది. ఈ సినిమా కోసం జీవితా రాజశేఖర్ తన వద్ద రూ. 65 లక్షలు అప్పుగా తీసుకున్నారని పరంధామ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. సినిమా విడుదల సందర్భంగా బాకీ తీరుస్తామని మాట ఇచ్చారని... కానీ తనకు రావాల్సిన మొత్తాన్ని జీవితా రాజశేఖర్ చెల్లించలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనిపై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు ... జీవితా రాజశేఖర్ 48 గంటల్లోగా రూ. 65 లక్షలను సెక్యూరిటీ డిపాజిట్ కింద కోర్టులో సమర్ఫించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే కోర్టు ఆదేశించినా డబ్బు చెల్లించకపోవడంతో శేఖర్ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై హీరో రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన చిత్రానికి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేసి, సినిమా ప్రదర్శన నిలిపివేయించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆదివారం ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘"శేఖర్ చిత్రాన్ని నేను, నా కుటుంబం మా సర్వస్వంగా భావించాం. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఎంతో కష్టపడ్డాం. శేఖర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కానీ, ఇంతలోనే కొందరు కావాలనే మా సినిమాను అడ్డుకుంటున్నారు. ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు.... ఎవరెన్ని చేసినా ఈ చిత్రం తిరిగి ప్రదర్శితమై, ప్రశంసలు పొందుతుందని, ఆ అర్హత ‘శేఖర్’కు ఉందని నేను భావిస్తున్నాను" అంటూ రాజశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment