వణికిస్తున్న ‘కరోనా’.: వైద్యులు, నర్సులకు దండంపెట్టిన యాంగ్రీస్టార్

  • IndiaGlitz, [Tuesday,February 11 2020]

చైనా.. కరోనా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్నవి ఈ రెండే పేర్లు. ఎక్కడ చూసినా కరోనా భయం.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే సుమారు 25 దేశాలకు పాకిపోయిన ఈ డేంజరస్ కరోనా వైరస్.. ఎప్పుడు ఏ దేశానికి వ్యాప్తిస్తుందో..? ఏ రాష్ట్రానికి అంటుతుందో..? అని జనాలు బిక్కుబిక్కుమంటున్నారు. అక్కడ దేశీయులను ఇండియాను రానివ్వడం లేదు.. ఒకవేళ వచ్చిన టెస్ట్‌లు చేసి అంతా ఓకే అంటే అనుమతిస్తున్నారు లేదంటే నో ఛాన్స్.

మీ సేవలకు దండం..!

ఇలాలంటి పరిస్థితుల్లో వైద్యులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో.. ఎలా శ్రమిస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ మహమ్మరి వైరస్ గురించి మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో, యాంగ్రీస్టార్ రాజశేఖర్ స్పందించి.. వైద్యులు, నర్సుల సేవలను కొనియాడారు. ‘మీరు చేస్తున్న సేవలకు చేతులెత్తి దండం పెట్టాలి. మీరు అందిస్తున్న సేవల పట్ల గర్విస్తున్నాం. కరోనా వైరస్ సోకకుండా మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి’ అని రాజశేఖర్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. కాగా.. సినిమాల్లోకి రాకముందు రాజశేఖర్ కూడా డాక్టరేనన్న సంగతి తెలిసిందే.