ఏపీకి గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో కరోనా తగ్గుముఖం: డా. ప్రభాకర్‌రెడ్డి
- IndiaGlitz, [Tuesday,August 11 2020]
ఏపీలో కరోనా ఉధృతి తీవ్ర స్థాయిలో ఉంది. ప్రతి రోజూ దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. కాగా.. కోవిడ్ కంట్రోల్ రూమ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తాజాగా ఏపీకి గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే నెల నుంచి ఈ కరోనా నుంచి కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వచ్చే నెల నుంచి కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 15 శాతంపైనే హెర్డ్ ఇమ్యూనిటీని గుర్తించినట్టు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం నుంచి శీరో సర్విలెన్స్ భారీగా ప్రారంభం కానున్నట్టు వెల్లడించారు.
రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే.. కోవిడ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గుతుందని తెలిపారు. అంతే కాకుండా ఆయన ఏయే జిల్లాల్లో ఎప్పటి నుంచి కరోనా తగ్గవచ్చో కూడా వెల్లడించారు. ఆగస్ట్ 21 నుంచి తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. అనంతరం సెప్టెంబర్ 4 నుంచి గుంటూరు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.