కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌‌లో తయారైందన్న డాక్టర్ లీకి షాక్..

  • IndiaGlitz, [Thursday,September 17 2020]

కరోనా వైరస్ వూహాన్‌ ల్యాబ్‌లో తయారైందంటూ హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ లి మెంగ్‌ యాన్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయని కూడా తెలిపింది. ఈ క్రమంలో ఆమెకు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. తన అకౌంట్‌ను సస్పెండ్ చేసినట్టు డాక్టర్ లి ప్రకటించింది. మంగళవారం డాక్టర్ లి ఖాతాను తొలగించినట్లు డైలీ మెయిల్‌లోని ఒక నివేదిక తెలిపింది. ‘మా నిబంధనలు అతిక్రమించిన ఎకౌంట్‌ను సస్పెండ్ చేస్తున్నాం’ అనే సందేశం డాక్టర్ లి అకౌంట్‌లో ప్రస్తుతం దర్శనమిస్తోంది. అయితే అంతకు మించి ట్విటర్ ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. కరోనాకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్న అకౌంట్‌ల విషయంలో ట్విటర్ ఇప్పటికే హెచ్చరిక సందేశాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే డాక్టర్ లి పెట్టిన పోస్టుల్లో ఏ పోస్టు ట్విట్టర్ నిబంధనలను అతిక్రమించిందనే దానిపై వివరాలను వెల్లడించలేదు.

కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందనడానికి తన వద్ద శాస్త్రీయ ఆధారాలున్నాయని డాక్టర్ లీ మెగ్ యాన్ స్పష్టం చేశారు. హాంగ్‌కాంగ్‌లోని స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌‌లో డాక్టర్ లీ.. కరోనా వైరస్‌పై గతేడాది నుంచి పరిశోధనలు చేస్తున్నారు. కాగా.. డాక్టర్ లీ తాను గుర్తించిన విషయాలను వెల్లడించారు. న్యుమోనియాపై పరిశోధనలు చేసే సమయంలోనే కరోనా వైరస్‌ ఉనికిని గుర్తించానని.. అది వుహాన్‌లోని ల్యాబ్‌లో తయారైనట్లు తెలిసిందన్నారు. ఆ వెంటనే తాను వైరస్‌కు సంబంధించి హెచ్చరికలు చేశానని.. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ.. చైనా అధికారులు కానీ పట్టించుకోలేదని డాక్టర్ లీ వెల్లడించారు. ఇంతటి ప్రమాదకరమైన వైరస్ విషయంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా తన హెచ్చరికలను బేఖాతరు చేశారని పేర్కొన్నారు.

ఈ వైరస్‌ ప్రకృతి నుంచి సహజసిద్ధంగా పుట్టింది కాదని.. వూహాన్ ల్యాబ్‌లోనే పుట్టిందని డాక్టర్ లీ స్పష్టం చేశారు.

వూహాన్ ల్యాబ్‌లో పుట్టిన వైరస్‌ను సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌లో పుట్టిందని ప్రపంచాన్ని భ్రమల్లో ఉంచారని డాక్టర్ లీ తెలిపారు. వైరస్‌కు సంబంధించిన అన్ని వివరాలూ చైనా అధికారులకు తెలుసన్నారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందన్న విషయం కూడా తెలుసని అయినా బయటకు తెలియనివ్వలేదన్నారు. వైరస్ గురించి మాట్లాడినందుకు తనను బెదిరించారని.. తన గురించి దుష్ప్రచారం చేశారని.. తన పరిశోధనకు సంబంధించిన సమాచారన్నంతా ధ్వంసం చేశారని డాక్టర్ లీ తెలిపారు. ఆ సమయంలో తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు అమెరికాకు పారిపోవాల్సి వచ్చిందని వెల్లడించారు. కాగా.. లీ ఆరోపణలన్నింటినీ వుహాన్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ యువాన్‌ జిమింగ్‌ తోసిపుచ్చగా. చైనా అధికారులెవరూ స్పందించలేదు.

More News

కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా

విజయవాడ నగర వాసుల ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. కనకదుర్గ ఫ్లై ఓవర్ నగరానికే ఒక మణిహారంలా నిలవబోతోంది.

దర్శకుడు ఎన్. శంకర్ చేతుల మీదుగా తెరవెనుక ఫస్ట్ లుక్ విడుదల

ఆయుష్ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్ మచ్చ నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం " తెరవెనుక "

తెలంగాణలో ఆసక్తికర పరిణామం.. భట్టి ఇంటికి తలసాని..

తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంటికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..

డ్రగ్స్ కేసు విషయమై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్..

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా బాగా వినిపిస్తోంది. అయితే దీనిపై రకుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

అల్లు అర్జున్‌పై కేసు నమోదు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు పుష్ప సినిమా యూనిట్‌పై ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.