ఒక గొప్ప స్టార్ ను కోల్పోయాము : డా. కే.ఎల్. నారాయణ

  • IndiaGlitz, [Monday,February 26 2018]

శ్రీదేవి లాంటి గొప్ప స్టార్ తో "క్షణక్షణం" చిత్రాన్ని నిర్మించడం ఆనందంగానూ, గర్వాంగానూ ఉండేదని, అయితే ఆమె హఠాత్తుగా మృతి చెందడం భారతీయ సినిమా రంగానికే తీరని లోటని నిర్మాత డా.కే.ఎల్.నారాయణ చెప్పారు.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా మ్రిత్రుడు ఎస్ గోపాల్ రెడ్డితో రూపొందించిన సినిమాలో శ్రీదేవిని నాయికగా ఎంపిక చేసుకున్నామని, అప్పటికే ఆమె పెద్ద స్టార్ అని నారాయణ తెలిపారు. తాము కొత్త నిర్మాతలమైనా అలాంటి భావన ఎప్పుడూ శ్రీదేవి వ్యక్తం చేయలేదని, చాలా గౌరవంగా ఉండేదని, ఏ సందర్భంలో కూడా మాకు అసౌకర్యం కలిగించలేదని, నంద్యాలలో షూటింగు చేసినప్పుడు పబ్లిక్ తో చాలా కష్టంగా ఉండేదని, అయినా శ్రీదేవి ఎంతో సహకరించిందని నారాయణ చెప్పారు.

ఆ చిత్రం షూటింగు జరుగుతూ ఉండగా వారి నాన్నగారు చనిపోయారని, అయినా ఆ బాధను కనబడనీయకుండా షూటింగులో పాల్గొనడం నిజంగా ఆమె గొప్ప మనసుకు నిదర్శనమని నారాయణ చెప్పారు. " "క్షణక్షణం" చిత్రంలో ఆమె నటనకు నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చినందుకు అప్పట్లో తామెంతో సంతోషపడ్డామని నారాయణ గుర్తుచేసుకున్నారు. శ్రీదేవి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వమని, నటిగా ఎన్ని శిఖరాలు అధిరోహించినా వినమ్రంగా ఉండే మనస్తత్వమని నారాయణ చెప్పారు. శ్రీదేవి మృతికి ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

More News

ఘ‌నంగా 'దండుపాళ్యం -3' ఆడియో ఫంక్ష‌న్‌

దండుపాళ్యం గ్యాంగ్ కి క‌న్న‌డ‌లో మంచి క్రేజ్ వుంది. ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ద‌ర్శ‌కుడు శ్రీనివాస‌రాజు రియ‌లిస్టిక్ గా తెర‌కెక్కించారు. అలా చేసిన‌  దండుపాళ్యం 1, దండుపాళ్యం 2 భారీ ఓపెనింగ్స్ తో సూపర్ సక్సెస్ సాధించాయి.

'శ్రీదేవి' మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు - డా.టి. సుబ్బరామి రెడ్డి

'శ్రీదేవి' హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్బ్రాంతి కి గురి చేసింది. నమ్మలేకపోతున్నాను. దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా మా కుటుంబానికి ఎంతో సన్నిహితురాలు, ఆప్తురాలు. ఎన్నో సినీ వేడుకలకు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేవారు.

మ‌ల్టీస్టార‌ర్ మూవీలో అనుష్క‌?

'భాగమతి' సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు సీనియ‌ర్ క‌థానాయిక‌ అనుష్క. ప్రస్తుతం స్వీటీ కొత్త‌ కథలను వినే క్రమంలో ఉన్నారు.

క‌ళ్యాణ్ రామ్‌ 'నా నువ్వే' ఎప్పుడంటే..

నందమూరి కళ్యాణ్ రామ్, మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారిగా క‌లిసి నటిస్తున్న‌ చిత్రం 'నా నువ్వే'. ఇంత‌కుముందు సిద్ధార్థ్, నిత్యా మీనన్, ప్రియా ఆనంద్ కాంబినేష‌న్‌లో '180' వంటి ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించిన జయేంద్ర  ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

"జింకను వేటాడేటప్పుడు పులి ఎంత సైలెంట్‌గా ఉంటాది.. మరి అటువంటిది పులినే వేటాడాలంటే మనం ఇంకెంత సైలెంట్‌గా ఉండాలి".. ఈ డైలాగ్ ను ఎన్టీఆర్, త్రివిక్రమ్ చక్కగా పాటిస్తున్నారు. వీరి కలయికలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఓ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.