'డా.చక్రవర్తి' పాటలు విడుదల

  • IndiaGlitz, [Monday,July 11 2016]

అదృష్టం, ఎ ఫిలిం బై అర‌వింద్‌, అర‌వింద్‌, త్రీ' వంటి విల‌క్ష‌ణ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ సూరి డైరెక్ష‌న్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ బ్యాన‌ర్‌పై రిషి, సోనియా మాన్‌, గిరీష్‌, లీనా, వంశీ ప్ర‌ధాన తారాగ‌ణంగా ఎ.వెంక‌టేశ్వ‌ర్లు(చాంఫ్‌), ర‌త్న‌మాల రెడ్డి, శేఖ‌ర్ సూరి నిర్మిస్తోన్న చిత్రం డా.చ‌క్ర‌వ‌ర్తి. ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని నిజ‌ఘ‌ట‌న‌ల‌లోని ఉద్దేశాల‌ను ఆధారంగా చేసుకుని శేఖ‌ర్ సూరి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆగ‌స్టులో సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. విజ‌య్ కురాకుల సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మంలో పలువురు సినీ రంగ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. అందులో భాగంగా హీరో శ్రీకాంత్ ఆడియో సీడీల‌ను ఆవిష్క‌రించి తొలి సీడీని క‌ల్వ‌కుంట్ల తేజేశ్వ‌ర్‌రావుకు అందించారు.

శేఖ‌ర్ సినిమాల్లో మంచి కాన్సెప్ట్‌తో టెక్నిక‌ల్‌గా చాలా డిఫ‌రెంట్‌గా ఉంటాయి. కొత్త పాయింట్‌ను చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. అలాగే ఈ సినిమా కూడా డిఫ‌రెంట్ గా ఉంటుంద‌ని భావిస్తున్నాను. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటూ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, యూనిట్ స‌భ్యుల‌కు ఆల్ ది బెస్ట్ అని హీరో శ్రీకాంత్ చెప్పారు. శేఖ‌ర్ సూరి సినిమాల‌ను మొద‌టి నుండి ఫాలో అవుతున్నాను. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాన‌ని క‌ల్వ‌కుంట్ల తేజేశ్వ‌ర్‌రావు అన్నారు. శేఖ‌ర్ సూరి అనుకున్న క‌మిట్‌మెంట్ ప్ర‌కారం సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేశారు. విజ‌య్ కురాకులగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా బ్యాన‌ర్‌లోనే శేఖ‌ర్ సూరిగారితో నెక్ట్స్ మూవీ ల‌య‌న్ స‌ఫారీని నిర్మిస్తాను. డా.చ‌క్ర‌వ‌ర్తి ఆగ‌స్గులో విడుద‌ల కాగానే, ఆగ‌స్టులోనే ల‌య‌న్ స‌ఫారీ చిత్రాన్ని స్టార్ట్ చేస్తాం అని నిర్మాత ఎ.వెంక‌టేశ్వ‌ర్లు(చాంఫ్‌) అన్నారు.

నిర్మాత వెంక‌టేశ్వ‌ర్లుగారే న‌న్ను త‌రుణ్‌కు ప‌రిచ‌యం చేశారు. ఆయ‌న వ‌ల్లే నేను ద‌ర్శ‌కుడిన‌య్యాను. ఆయ‌న‌కు ఏదో చేయాల‌ని అనుకుంటుండేవాడిని అలాంటి స‌మ‌యంలో ఆయ‌న‌కు ఓ స్టూడియో స్టార్ట్ చేసిన త‌ర్వాత నా వ‌ద్ద‌కు వ‌చ్చి ఓ సినిమా చేసి పెట్టాల‌ని కోరారు. అప్పుడు నేను ఈ డా.చ‌క్ర‌వ‌ర్తి సినిమా చేశాను. రిషితో నేను చేస్తున్న మూడో సినిమా. త‌ను మంచి న‌టుడు, సీనియ‌ర్ యాక్ట‌ర్ అశోక్‌కుమార్‌గారి అబ్బాయి వంశీ చాలా కీల‌క‌మైన పాత్ర‌లో చాలా చ‌క్క‌గా యాక్ట్ చేశాడు. అలాగే లీనా, గిరీష్‌, అనిరుధ్ సింగ్ స‌హా అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. సినిమాను ముందుగా తెలుగ‌లో విడుద‌ల చేసి త‌ర్వాత త‌మిళం, హిందీల్లోకి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తామ‌ని ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ సూరి అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్‌.వి.కృష్ణారెడ్డి, ఇంద్రగంటి మోహ‌నకృష్ణ‌, రాజ్‌కందుకూరి, ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ స‌హా చిత్ర‌యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. రిషి, సోనియా మాన్‌, గిరీష్‌, లీనా, వంశీ , అశోక్‌కుమార్‌, పోకిరి విజ‌య్‌, చైత‌న్య త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: విజ‌య్‌కురాకుల‌, కెమెరాః రాజేంద్ర‌, ఎడిటింగ్ః తిరుప‌తి రెడ్డి, ఫైట్స్ః స‌తీష్‌, మాట‌లుః చిట్టి శ‌ర్మ‌, నిర్మాత‌లుః ఎ.వెంక‌టేశ్వ‌ర్లు(చాంప్), ర‌త్న‌మాల‌రెడ్డి, శేఖ‌ర్ సూరి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శేఖ‌ర్ సూరి.