కత్తి మహేష్ మృతిపై డౌట్స్ ఇవే.. విచారణకు డిమాండ్
Send us your feedback to audioarticles@vaarta.com
గత నెల జూన్ 26న ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కారు ప్రమాదానికి గురికావడం, చికిత్స పొందుతూ ఇటీవల మరణించడం తెలిసిందే. కత్తి మహేష్ చిత్తూరులోని తన స్వగ్రామానికి వెళుతుండగా నెల్లూరు సమీపంలో కారు ప్రమాదానికి గురయ్యారు. కారు ప్రమాదం జరిగినప్పుడు కత్తి మహేష్ స్వల్ప గాయాలకు మాత్రమే గురయ్యారని, ప్రమాదం ఏమీ లేదనే వార్తలు వినిపించాయి.
అంతలోనే పరిస్థితి విషమించిందని, నెల్లూరులో చికిత్స తర్వాత చెన్నైకి తరలించారు. అక్కడ కూడా ఆసుపత్రి నుంచి ఇలాంటి వార్తలే వచ్చాయి. కంటికి, తలా భాగానికి బలమైన గాయాలు అయ్యాయి. సర్జరీలు చేయాలి. అయితే ప్రాణాపాయం లేదంటూ వార్తలు వినిపించాయి. కానీ కొన్ని వారాల చికిత్స అనంతరం కత్తి మహేష్ ఆరోగ్యం విషమించి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
దీనితో కత్తి మహేష్ ని అభిమానించేవారు, సన్నిహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇటీవల చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామంలో కత్తి మహేష్ అంత్యక్రియలని కుటుంబ సభ్యులు జరిపించారు. కత్తి మహేష్ అంత్యక్రియలకు జనం భారీగా తరలివచ్చారు. మందకృష్ణ మాదిగ లాంటి బహుజన నాయకులు కూడా కత్తి మహేష్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కత్తి మహేష్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, అవి నివృత్తి కావలసిన అవసరం ఉందని అన్నారు.
ప్రమాదంలో కారు బాగా ధ్వంసం అయింది. డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. కత్తి మహేష్ కి మాత్రమే అంత తీవ్ర గాయాలు ఎలా అయ్యాయి ? కత్తి మహేష్ మరణించే ముందు వరకు కూడా అతడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతూ వచ్చాయి. ప్రాణాపాయం లేనప్పుడు అతడు ఎలా మరణించాడు ? ఇన్ని రోజుల పాటు వైద్యులు చేసిన చికిత్స ఏంటి ?కత్తి మహేష్ మరణించిన తర్వాత కూడా ఆయనపై చాలా మంది అక్కసు వెళ్లగక్కారు.. వారే ఏమైనా కుట్ర చేశారా ? అంటూ మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలని తెరపైకి తీసుకువచ్చారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజాయతీ కలిగిన ఉన్నత అధికారులతో కత్తి మహేష్ మృతిపై విచారణ జరపాలి లేదా సిట్టింగ్ జడ్జిని నియమించాలి అని మందకృష్ణ డిమాండ్ చేశారు.
ఫిలిం క్రిటిక్ గా, నటుడిగా గుర్తింపు పొందిన కత్తి మహేష్ అనేక వివాదభరిత అంశాలలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కత్తి మహేష్ టాలీవుడ్ లో దర్శకుడిగా, రచయితగా, నటుడిగా రాణించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments