కత్తి మహేష్ మృతిపై డౌట్స్ ఇవే.. విచారణకు డిమాండ్

  • IndiaGlitz, [Tuesday,July 13 2021]

గత నెల జూన్ 26న ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ కారు ప్రమాదానికి గురికావడం, చికిత్స పొందుతూ ఇటీవల మరణించడం తెలిసిందే. కత్తి మహేష్ చిత్తూరులోని తన స్వగ్రామానికి వెళుతుండగా నెల్లూరు సమీపంలో కారు ప్రమాదానికి గురయ్యారు. కారు ప్రమాదం జరిగినప్పుడు కత్తి మహేష్ స్వల్ప గాయాలకు మాత్రమే గురయ్యారని, ప్రమాదం ఏమీ లేదనే వార్తలు వినిపించాయి.

అంతలోనే పరిస్థితి విషమించిందని, నెల్లూరులో చికిత్స తర్వాత చెన్నైకి తరలించారు. అక్కడ కూడా ఆసుపత్రి నుంచి ఇలాంటి వార్తలే వచ్చాయి. కంటికి, తలా భాగానికి బలమైన గాయాలు అయ్యాయి. సర్జరీలు చేయాలి. అయితే ప్రాణాపాయం లేదంటూ వార్తలు వినిపించాయి. కానీ కొన్ని వారాల చికిత్స అనంతరం కత్తి మహేష్ ఆరోగ్యం విషమించి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

దీనితో కత్తి మహేష్ ని అభిమానించేవారు, సన్నిహితులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇటీవల చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామంలో కత్తి మహేష్ అంత్యక్రియలని కుటుంబ సభ్యులు జరిపించారు. కత్తి మహేష్ అంత్యక్రియలకు జనం భారీగా తరలివచ్చారు. మందకృష్ణ మాదిగ లాంటి బహుజన నాయకులు కూడా కత్తి మహేష్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కత్తి మహేష్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, అవి నివృత్తి కావలసిన అవసరం ఉందని అన్నారు.

ప్రమాదంలో కారు బాగా ధ్వంసం అయింది. డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. కత్తి మహేష్ కి మాత్రమే అంత తీవ్ర గాయాలు ఎలా అయ్యాయి ? కత్తి మహేష్ మరణించే ముందు వరకు కూడా అతడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతూ వచ్చాయి. ప్రాణాపాయం లేనప్పుడు అతడు ఎలా మరణించాడు ? ఇన్ని రోజుల పాటు వైద్యులు చేసిన చికిత్స ఏంటి ?కత్తి మహేష్ మరణించిన తర్వాత కూడా ఆయనపై చాలా మంది అక్కసు వెళ్లగక్కారు.. వారే ఏమైనా కుట్ర చేశారా ? అంటూ మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలని తెరపైకి తీసుకువచ్చారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజాయతీ కలిగిన ఉన్నత అధికారులతో కత్తి మహేష్ మృతిపై విచారణ జరపాలి లేదా సిట్టింగ్ జడ్జిని నియమించాలి అని మందకృష్ణ డిమాండ్ చేశారు.

ఫిలిం క్రిటిక్ గా, నటుడిగా గుర్తింపు పొందిన కత్తి మహేష్ అనేక వివాదభరిత అంశాలలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కత్తి మహేష్ టాలీవుడ్ లో దర్శకుడిగా, రచయితగా, నటుడిగా రాణించారు.

More News

స్వాతి రెడ్డి ఫోటో వైరల్.. ఫేక్ ప్రచారం, అసలు క్లారిటీ ఇదిగో!

దేశం గర్వించదగ్గ చిత్రకారుడు రాజా రవివర్మ. మగువల అందాన్ని పొగడాలంటే ఆయన పెయింటింగ్స్ తో పోల్చాల్సిందే. అంతగా రాజా రవివర్మ ఆర్ట్ వర్క్ అందరిని మంత్ర ముగ్దుల్ని చేసింది.

వైరల్ వీడియో: అమీర్ ఖాన్ నీతులు బాగానే చెబుతాడు.. అసలు నిర్వాకం ఇదీ!

సెలెబ్రెటీలకు నిత్యం సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ విమర్శకులకు టార్గెట్ గా మారారు. కెమెరాల ముందు నీతులు

RC15 క్రేజీ అప్డేట్.. ఆ మూవీ చూసి ఒక్క ఫోటో చాలనుకున్నా, అలాంటిది..

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ కాంబినేషన్ భారీ చిత్రానికి రంగం సిద్దమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న

మేకప్ లేకుండా ఇలియానా బోల్డ్ ఫోజు.. బీచ్ లో హద్దులు దాటేసిందిగా..

గోవా బ్యూటీ ఇలియానా ఘాటు సొగసు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో

ఒళ్ళు గగుర్పొడిచేలా 'రాక్షసుడు 2' పోస్టర్.. లీడ్ రోల్ లో స్టార్ హీరో?

బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు చిత్రం గుర్తుందిగా. తమిళంలో విష్ణు విశాల్ నటించిన రాక్షసన్ చిత్రానికి రాక్షసుడు తెలుగు రీమేక్ గా తెరకెక్కింది. సైకో థ్రిల్లర్ గా తెరకెక్కిన.