లక్కీ అంటే అనసూయదే... ఇప్పుడిక డబుల్ కిక్!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును నిజమే.. లక్కీ అంటే హాట్ యాంకర్ అనసూయదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే రెండు మూడు తరాల హీరోలతో నటించి అటు సినిమాలతో.. ఇటు వ్యాఖ్యతగా బిజిబిజీగా గడిపేస్తోంది. ముఖ్యంగా మెగా, అక్కినేని, దగ్గుబాటి హీరోలతో సరసన నటించి మెప్పించింది. అయితే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనే ఛాన్స్ కొట్టేసిందోచ్.. ఒక్క చిరుతోనే కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో కూడా ఓ పాత్ర రెడీ అయ్యిందట.
అనసూయ ఇప్పటికే మెగా హీరోల సరసన నటించిన విషయం తెలిసిందే. అయితే మిగతా వారి సినిమాల్లో కంటే మెగా హీరోల సినిమాలంటే చాలు.. అనసూయ ఆ పాత్ర అరనిమిషమా..? పాత్ర సరైందా..? కాదా అనేది ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. అందుకే ఈ భామ దాదాపు మెగా హీరోల సినిమాల్లో డైరెక్టర్లు సైతం ఏదో ఒక పాత్ర ఇస్తుంటారు. అయితే ఆమెకిచ్చిన తగిన న్యాయం చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఇక అసలు విషయానికొస్తే.. కొరటాల శివ-చిరు కాంబోలో ఆగస్టు-22న మూవీ షూటింగ్ ప్రారంభిస్తారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఈ హాట్ బ్యూటీ అనసూయకు ఓ కీలక పాత్ర ఉంటుందట. తనకు చిరు సినిమాలో అవకాశం ఇవ్వాల్సిందేనని కొరటాల వద్దకెళ్లి పట్టుబట్టి మరీ ప్రత్యేక పాత్ర తీసుకుందట. అంతేకాదు.. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో త్వరలో సినిమా రానుందని టాక్. ఈ చిత్రంలో కూడా అనసూయకు పాత్ర ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే రెండు జనరేషన్‌ల హీరోలతో అనసూయ బిజిబిజీగా గడపనుందన్న మాట.
అంతేకాదండోయ్.. ఇప్పటికే అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేశ్‌ల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మకు చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే ఎక్కడలేని ఆనందం వచ్చిందట. చిరు-అల్లువారబ్బాయి సరసన నటిస్తే అనసూయకు ఇక డబుల్ కిక్ అంతేనేమో. అయితే ఈ పుకార్లు ఎంతవరకు నిజం అవుతాయో..? లేదో వేచి చూడాల్సిందే మరి. ఇదే నిజమైతే మాత్రం ఇక అనసూయకు తిరుగుండదేమో..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout