దేవకి కాదు.. మీరు నా ‘దొరసాని’.. టీజర్ రివ్యూ

  • IndiaGlitz, [Thursday,June 06 2019]

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రాజ‌శేఖ‌ర్ చిన్న కూతురు శివాత్మిక జంట‌గా.. నిజ జీవితానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఎంతో రియ‌లిస్టిక్‌గా తెర‌కెక్కుతున్న టాలీవుడ్ చిత్రం ‘దొరసాని’. ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర దర్శకుడు తెరకెక్కించగా.. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా.. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ఫస్ట్ లుక్ అంచనాలు పెంచగా.. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మరింత అంచనాలు పెంచాయి. 

టీజర్ రివ్యూ...

ఈ మధ్య అందరూ తెలంగాణ యాసలో దంచికొడుతున్నారు. ‘అర్జున్‌రెడ్డి’, ‘ఫలక్‌నుమా దాస్‌’తో పాటు పలు చిత్రాల్లో అచ్చంగా తెలంగాణ యాసతో నడిపేశారు. ఈ రెండు చిత్రాలు అనుకున్నదానికంటే మంచిగానే సక్సెస్ అయ్యాయి. దీంతో ‘దొరసాని’ని కూడా దర్శకుడు మహేంద్ర అదే బాటలో నడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ‘చిన్న దొరసాని గడెం నుంచి బయటికే రాదు’.. అనే మాటతో టీజర్ ప్రారంభమవుతుంది. ఇందులో హీరోను మీ పేరేంటి అని అడగ్గా.. రాజు అని చెబుతాడు.. మీరు దొరసాని అని హీరో అనగా.. కాదు ‘దేవకి’ అని హీరోయిన్ చెబుతుంది.. ‘కాదు మీరు నా దొరసాని’ అని ఆనంద్ చెబుతాడు. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్ అనిపించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజుగా ఆనంద్‌, దొర‌సానిగా శివాత్మిక స‌రిగ్గా స‌రిపోయారని చెప్పుకోవచ్చు. 

టీజర్ విడుదలైన కొంత సేపటికే 29K వ్యూస్.. 2.9K రావడం విశేషమని చెప్పుకోవచ్చు. మరోవైపు నెటిజన్లు, విజయదేవరకొండ అభిమానులు, సినీ ప్రియులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వీరిలో కొందరు పాజిటివ్‌గా.. ఎక్కువ మంది నెగిటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. అయితే సినిమా ఏ మాత్రం సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

More News

టీడీపీని కుదిపేస్తున్న నాని వ్యవహారం.. అసలేం జరుగుతోంది!

విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం తెలుగుదేశం పార్టీని కుదిపేస్తోంది. రోజురోజుకు నాని ఎందుకిలా వ్యవహరిస్తున్నారో..? అసలు నాని మనసులో ఏముందో..?

షాకింగ్ ట్విస్ట్ : వైసీపీ తరఫున రాజ్యసభకు ముద్రగడ!?

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్తారా..? వైసీపీ నుంచి ముద్రగడకు ఆహ్వానం అందిందా..?

తోట ఫ్యామిలీకి కీలక పదవి.. హామీ ఇచ్చిన జగన్!

ఇదేంటి.. తోట ఫ్యామిలీ నుంచి ఒకరు వైసీపీ నుంచి.. మరొకరు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారుగా..?

పవన్‌పై గెలిచిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఫిక్స్!?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని భారీ మెజార్టీతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. టీడీపీ, జనసేన పార్టీల అడ్రస్ గల్లంతైన సంగతి తెలిసిందే.

జగన్.. తన లెఫ్ట్, రైట్‌ ఇద్దరికీ మంత్రి పదువులివ్వరా!?

వైఎస్ జగన్‌ కష్టకాలంలో ఉన్నప్పుడు తమ పదవులకు సైతం రాజీనామా చేసి ఆయన వెంట నడిచిన ఆ ఇద్దరికీ మంత్రి పదవులు లేనట్టేనా..?