హృదయాలను ఏలే ‘దొరసాని’

  • IndiaGlitz, [Thursday,May 30 2019]

రియలిస్టిక్ అండ్ ఇంటెన్సిటీ ఉన్న కథలకు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. అలాంటి ఓ రియలిస్టిక్ స్టోరీతో వస్తోన్న చిత్రమే ‘దొరసాని’. టైటిల్ కు తగ్గట్టుగానే ఇది తెలంగాణలోని ఓ ప్రాంతంలో 80 దశకం లో జరిగిన కథగా వస్తోంది. లేటెస్ట్ గా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ పరిశ్రమ వర్గాల్లోనూ మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఆ ఆసక్తిని మరింత పెంచేలా ఈ ఫస్ట్ లుక్ ఉంది. కథ లోంచి పరిచయం అయిన రాజు, దొరసాని చూడ ముచ్చటగా ఉన్నారు. కారులో కూర్చున్న దొరసానిని ఆ పక్కనే సైకిల్ పై వచ్చిన హీరో ఆరాధనగా చూస్తున్నట్టుగా ఈ ఫస్ట్ లుక్ ఒక రకంగా కథలోని ఆత్మను చెబుతోంది. రాజు కళ్ళల్లో ప్రేమ, దొరసాని కళ్ళల్లో దర్పం ఈ ప్రేమ కథ లో వైరుధ్యాన్ని చూపిస్తున్నాయి.

హీరో, హీరోయిన్ల డ్రెస్సింగ్ తో పాటు ఆమె ఉన్న కార్ ను బట్టి కథకు తగ్గట్టుగా నాటి కాలపు వాతావరణాన్ని ఈ చిత్రంలో రీ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం వస్తోన్న రియలిస్టిక్ మూవీస్ లో ఈ చిత్రం ఓ కొత్త తరహాగా నిలువబోతోందని ఈ లుక్ చెప్పకనే చెబుతోంది.

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక హీరో, హీరోయిన్లు గా పరిచయం చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ , బిగ్ బెన్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తో కెవిఆర్ మహేంద్ర దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. అలాగే ఈ చిత్ర టీజర్ జూన్ 6 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ : సన్ని కూరపాటి, సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి, పిఆర్.వో : జిఎస్.కె మీడియా, నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని, రచన, దర్శకత్వం : కెవిఆర్ మహేంద్ర.