కరోనా క్యారియర్‌గా మారకూడదనుకున్నా: లావణ్యా త్రిపాఠి
Send us your feedback to audioarticles@vaarta.com
డెహ్రాడూన్ ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. లాక్‌డౌన్ అనంతరం ఈ నెల మొదటి వారంలో సొంత గూటికి చేరుకున్న ఈ ముద్దుగుమ్మ డెహ్రాడూన్‌కు చేరుకున్నాక పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ ఏదో లాక్‌డౌన్‌లో ఇరుక్కుపోయినట్టు ఫీలవలేదని.. ఇక్కడ చాలా కంఫర్ట్‌గా ఉన్నానని తెలిపింది. లాక్‌డౌన్‌కు ముందే తాను వెళ్లిపోయి ఉండేదాన్నని కానీ తన డిజైనర్ ఫ్రెండ్ సాయంతో మాస్కులు తయారు చేసి వాటిని పంచడం వంటివి చేశానని ముద్దుగుమ్మ తెలిపింది. తనకు 16 ఏళ్లు వచ్చినప్పటి నుంచే స్వతంత్రంగా ఉన్నానని.. తన ఇంటికి హైదరాబాద్ చాలా దూరమని తెలిపింది. సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కాకుండా పలువురు స్నేహితులు తనకు హైదరాబాద్‌లో ఉన్నారని లావణ్య వెల్లడించింది.
ఇంకా లావణ్య మాట్లాడుతూ.. ‘‘నటిగా నేను బిజీగా మారిపోయినా.. ఒక హెల్దీ లైఫ్ స్టైల్‌ని కొనసాగిస్తున్నా.. ఒంటరిగా జీవించడం ఎంత కష్టమో గ్రహించాను. చాలా మంది నటులు సూసైడకి పాల్పడటం గురించి విన్నాను. అయితే నటులుగా అందం, నైపుణ్యాలపై దృష్టి పెడుతున్నట్టే మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. నా కజిన్ సూసైడ్ చేసుకుని చనిపోయింది. కాబట్టి మానసిక ఆరోగ్యం ప్రాధాన్యత నాకు బాగా తెలుసు’ అని పేర్కొంది. ఇక డెహ్రాడూన్ తిరిగి వెళ్లడం గురించి లావణ్య మాట్లాడుతూ.. ‘‘నా స్నేహితులతో చర్చించిన మీదట ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అయితే ఇంటికి కరోనా బారిన పడకుండా చేరడమనేది పెద్ద సవాల్. నేను కరోనా క్యారియర్ మారి నా సోదరికి, మేనల్లుడికి, తల్లిదండ్రులకు అంటించకూడదని నిర్ణయించుకున్నా.
అనంతరం పీపీఈ కిట్ ధరించి డెహ్రాడూన్ చేరుకున్నా. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నా. అయితే ఇంటికి వెళ్లాక కూడా మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నా. అంతా నార్మల్ అనుకున్నాకే ఇంట్లో వారితో కలిసిపోయాను. అయినప్పటికీ మాస్క్ తీయాలంటే భయం వేసింది’’ అని లావణ్య వెల్లడించింది. ఇంకా లావణ్య మాట్లాడుతూ.. ‘‘డెహ్రాడూన్ ఎంత అందంగా ఉండే ప్రదేశమో కూడా నేను మరచిపోయాను. నన్ను చూసి నా తల్లిదండ్రులు చాలా సంతోషించారు. మా అమ్మ రుచికరమైన వంటలన్నీ చేసి నాకు తినిపిస్తోంది’ అని తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout