Vijaykanth: కెప్టెన్ కోలుకుంటున్నారు, ఆందోళన వద్దు : భార్య ప్రేమలత సందేశం
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ అగ్రనటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు ఆయన సతీమణి ప్రేమలత క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె అభిమానులకు, తమిళనాడు ప్రజలకు ఓ వీడియో సందేశం పంపారు.‘‘ విజయకాంత్ ఆరోగ్యంపై భయపడాల్సిన పనిలేదు. తలైవర్ కెప్టెన్ పరిస్థితి బాగానే ఉంది. అందరి ప్రార్థనలు , ఆయన ధర్మం అతన్ని తప్పకుండా కాపాడుతుంది. తాము, కుటుంబ సభ్యులు, వైద్యులు అతనిని బాగా చూసుకుంటున్నాము. ఎలాంటి వదంతులను నమ్మొద్దు.. త్వరలోనే ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు' అని ప్రేమలత వీడియో సందేశంలో పేర్కొన్నారు.
కాగా.. గత కొంతకాలంగా విజయ్ కాంత్ డయాబెటిస్, లివర్, జలుబు, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధి కారణంగా ఇప్పటికే డాక్టర్లు ఆయన మూడు వేళ్లను తొలగించారు. గత కొన్నిరోజులుగా చెన్నైలోని ఎంఐఓటీ ఆసుపత్రిలో కెప్టెన్ విజయ్ కాంత్ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. విజయ్ కాంత్ ఆరోగ్యం మెరుగుపడుతోందని.. అయినప్పటికీ గడిచిన 24 గంటల్లో ఆయన పరిస్ధితి నిలకడగా లేనందున, విజయ్‌కాంత్‌కు పల్మనరీ చికిత్సలో సహాయం కావాలి.. ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. మరో 14 రోజుల పాటు విజయ్‌కాంత్ ఆసుపత్రిలో వుండాల్సి వుంటుందని ’’ ఎంఐవోటీ వర్గాలు హెల్త్ బులెటిన్‌లో వివరించాయి.
మరోవైపు.. విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలంటూ డీఎండీకే శ్రేణులు, అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గెట్వెల్ సూన్ కెప్టెన్ అంటూ సోషల్ మీడియా హోరేత్తిపోతోంది. భర్త ఆసుపత్రిలో వుండటంతో డీఎండీకే బాధ్యతలను ప్రేమలత చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె పార్టీ కోశాధికారి పదవిలో వున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments