Vijaykanth: కెప్టెన్ కోలుకుంటున్నారు, ఆందోళన వద్దు : భార్య ప్రేమలత సందేశం

  • IndiaGlitz, [Thursday,November 30 2023]

తమిళ అగ్రనటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు ఆయన సతీమణి ప్రేమలత క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె అభిమానులకు, తమిళనాడు ప్రజలకు ఓ వీడియో సందేశం పంపారు.‘‘ విజయకాంత్ ఆరోగ్యంపై భయపడాల్సిన పనిలేదు. తలైవర్ కెప్టెన్ పరిస్థితి బాగానే ఉంది. అందరి ప్రార్థనలు , ఆయన ధర్మం అతన్ని తప్పకుండా కాపాడుతుంది. తాము, కుటుంబ సభ్యులు, వైద్యులు అతనిని బాగా చూసుకుంటున్నాము. ఎలాంటి వదంతులను నమ్మొద్దు.. త్వరలోనే ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు' అని ప్రేమలత వీడియో సందేశంలో పేర్కొన్నారు.

కాగా.. గత కొంతకాలంగా విజయ్ కాంత్ డయాబెటిస్, లివర్, జలుబు, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధి కారణంగా ఇప్పటికే డాక్టర్లు ఆయన మూడు వేళ్లను తొలగించారు. గత కొన్నిరోజులుగా చెన్నైలోని ఎంఐఓటీ ఆసుపత్రిలో కెప్టెన్ విజయ్ కాంత్ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. విజయ్ కాంత్ ఆరోగ్యం మెరుగుపడుతోందని.. అయినప్పటికీ గడిచిన 24 గంటల్లో ఆయన పరిస్ధితి నిలకడగా లేనందున, విజయ్‌కాంత్‌కు పల్మనరీ చికిత్సలో సహాయం కావాలి.. ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. మరో 14 రోజుల పాటు విజయ్‌కాంత్ ఆసుపత్రిలో వుండాల్సి వుంటుందని ’’ ఎంఐవోటీ వర్గాలు హెల్త్ బులెటిన్‌లో వివరించాయి.

మరోవైపు.. విజయ్ కాంత్ త్వరగా కోలుకోవాలంటూ డీఎండీకే శ్రేణులు, అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గెట్‌వెల్ సూన్ కెప్టెన్ అంటూ సోషల్ మీడియా హోరేత్తిపోతోంది. భర్త ఆసుపత్రిలో వుండటంతో డీఎండీకే బాధ్యతలను ప్రేమలత చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె పార్టీ కోశాధికారి పదవిలో వున్నారు.

More News

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా.. పలువురు రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేసిన చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్

తెలంగాణలో ఓట్ల జాతర మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. సామాన్యులతో పాటు సినీ

Rules Ranjan:ప్రముఖ ఓటీటీలో 'రూల్స్ రంజన్'.. ఎప్పుడంటే..?

యువ హీరో కిరణ్ అబ్బవరం 'రాజావారు రాణివారు' సినిమాతో అరంగేట్రం చేశాడు. పక్కింటి కుర్రాడిలా నటించి అభిమానులను ఆకట్టుకున్నాడు.

Celebrities:హైదరాబాద్‌లో సినీ సెలబ్రిటీలు ఎక్కడ ఓటేయనున్నారో తెలుసా..?

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు(గురువారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

Sudigali Sudheer:ఎన్ని జన్మలు ఎత్తినా అభిమానుల రుణం తీర్చుకోలేను.. ‘కాలింగ్ సహస్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్

బుల్లి తెరపై సుడిగాలి సుధీర్‌కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బుల్లితెరపై సూపర్ స్టార్‌గా ఫేమస్ అయిన సుధీర్ నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’.