కరోనాపై నిర్లక్ష్యం వద్దు.. ఇలా చేయండి..: చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ అన్నీ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్లో అందరి కంటే ముందుగా తన ‘ఆచార్య’ సినిమాను షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. అనంతరం థియేటర్ల మూసివేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది. ఇప్పటికే కరోనా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని టాలీవుడ్‌కు చెందిన నటీనటులు వీడియోలు, సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. అయితే తాజాగా.. మెగాస్టార్ చిరు కూడా జాగ్రత్తలు, సలహాలు, సూచనలు చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
ఇంటి వద్దే ఉండండి!
‘నమస్కారం.. యావత్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోన్న సమస్య కరోనా వైరస్. అయితే, మనకి ఏదో అయిపోతుందన్న భయం కానీ, ఏమీ కాదన్న నిర్లక్ష్యం కానీ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జన సమూహానికి వీలైనంత దూరంగా ఉండండి. ఈ ఉద్ధృతి తగ్గేవరకు ఇంటి వద్దే ఉండడం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేతుల్ని వీలైనన్నీ సార్లు సుమారు 20 క్షణాల పాటు శుభ్రంగా కడుక్కోవాలి’ అని చిరు చెప్పారు.
ఇలా చేయండి!
‘తుమ్మినా, దగ్గినా కర్చీఫ్ లాంటివి అడ్డు పెట్టుకోవడం లేక టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూపేపర్ కూడా చెత్త బుట్టలో వేయండి. జ్వరం, జలుబు, దగ్గు, అలసట ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. కరోనా మహమ్మారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. ఎవరికీ కరచాలనం చేయకుండా మన సంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం’ అని మెగాస్టార్ వీడియో ద్వారా పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout