YS Sharmila: షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇవ్వొద్దు.. మాజీ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు..

  • IndiaGlitz, [Thursday,January 11 2024]

వైయస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్, షర్మిల ఇద్దరు ఒక్కటేని.. అందుకే ఆమెకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించవొద్దని అధిష్టానాని కోరారు. షర్మిలపై అంత ప్రేమ, నమ్మకం ఉంటే ఆమెను జాతీయ రాజకీయాల్లో తీసుకోండని సూచించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానో.. కర్ణాటక పార్లమెంట్ లేదా రాజ్యసభ సీటు ఇవ్వాలని తెలిపారు. దేశ రాజకీయాల్లో స్టార్ క్యాంపెయినర్‌గా వాడుకోవాలని.. ఏపీసీసీ బాధ్యతలు మాత్రం ఇవ్వకండని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ బిడ్డగా తాను రాజకీయాల్లోకి వచ్చానని షర్మిల గతంలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీలో బాధ్యతలు అప్పగించవద్దన్నారు. ఇక్కడ ఎవరూ నాయకులు లేరా అని ప్రశ్నించారు. చాలా మంది సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారని.. వారిలో ఎవరినైనా నియమించవొచ్చని పేర్కొన్నారు. అలాగే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను అమలాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

కాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిలను ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దివంగత సీఎం వైఎస్సార్ వారసురాలిగా ఆమె సేవలు రాష్ట్రంలో వినియోగించుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అంతేకాకుండా ఆమెకు బాధ్యతలు అప్పగిస్తే వైసీపీలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న కీలకమైన రెడ్డి సామాజికవర్గం నేతలతో పాటు ఇతర ముఖ్య నేతలు పార్టీలోకి చేరే అవకాశాలున్నాయని యోచిస్తున్నారు.

ఈ క్రమంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వంటి ప్రముఖ నాయకులు కాంగ్రెస్‌లో చేరతామని ఇప్పటికే ప్రకటించారు. వీరితో పాటు మరికొంతమంది కూడా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో షర్మిలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని రాహుల్ గాంధీ ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు అతి త్వరలోనే పార్టీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో షర్మిల పట్ల హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

More News

Vyuham: 'వ్యూహం' సినిమా విడుదలపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్..

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును

Mudragada: ముద్రగడకు టీడీపీ-జనసేన వల.. మరి 'కాపు' కాస్తారా..?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రోజురోజుకు పార్టీలు మారే నేతలు ఎక్కువైపోతున్నారు. ఎవరూ ఏ పార్టీలోకి వెళ్తారో తెలియడం లేదు. ఎవరు ఔనన్నా

Guntur Kaaram Making: 'గుంటూరు కారం' మేకింగ్ వీడియో.. మహేష్ ఎనర్జీ మామూలుగా లేదుగా..

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం మరికొన్ని గంటల్లోనే రానుంది. ఇవాళ అర్థరాత్రి ఒంటి గంట నుంచే 'గుంటూరు కారం' మూవీ బెనిఫిట్ షోలు పడనున్నాయి.

MLC By-Elections: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం

Vikram Goud: టీబీజేపీకి విక్రమ్ గౌడ్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక..!

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్‌లో కీలక నేత దివంగత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.