Tantra:మా సినిమాకి 'పిల్ల బచ్చాలు' రావొద్దు.. 'తంత్ర' మూవీ మేకర్స్ వార్నింగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో హార్రర్ సినిమాలకు ప్రేక్షకులకు బ్రహ్మరథం పడుతారు. ఈ జోనర్‌లో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ప్రేక్షకులను భయపట్టేందుకు 'తంత్ర' అనే సినిమా రాబోతుంది. టెడ్డీబేర్‌కి మీరు జోలపాడితే బాగుంటుంది.. కానీ ఆ టెడ్డీబేర్ మీకు జోల పాడితే.. ఆ ఊహే భయంకరంగా ఉంది కదా! అలాంటిదే మా చిత్రం అంటున్నారు మూవీ మేకర్స్. మార్చి 15న థియేటర్లలో మిమ్మలి భయపెట్టేందుకు వస్తున్నాం.. మీరు సిద్ధమా? అని ఛాలెంజ్ చేస్తున్నారు. అలాగే చిత్ర ప్రమోషన్స్‌ను వెరైటీగా స్టార్ట్ చేశారు.
తమ సినిమాకు A సర్టిఫికేట్ రావడంపై 'తంత్ర' టీమ్ డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యింది. మా సినిమాకి 'పిల్ల బచ్చాలు' రావద్దని హెచ్చరిస్తూ 'A' ని పెద్దగా హైలైట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం డిజిటల్ కాలంలో ఇదొక సరికొత్త క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఇలా తమ సినిమాను ప్రేక్షకుల్లోకి తొందరగా తీసుకువెళ్లొచ్చని భావిస్తున్నారు. అలాగే తమ సినిమా మంచి హర్రర్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్ .. చిన్నపిల్లలు రావద్దని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన్ టీజర్, సాంగ్స్‌ని యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిన్ అనన్య నాగళ్ల పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా టీజర్‌లో కనపడితే.. 'ధీరే ధీరే' సాంగ్‌లో అందమైన ప్రియురాలిగా కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొడుతోంది. అనన్యకి జోడీగా శ్రీహరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ధనుష్ రఘుముద్రి మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు.
వీరే కాకుండా మర్యాదరామన్న ఫేం సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ఈ హార్డ్ హిట్టింగ్ హర్రర్ డ్రామాకి తమదైన గాఢతని తీసుకొచ్చారని దర్శకుడు చెబుతున్నాడు. మారుమూల శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామం నుంచి వచ్చిన ఈ దర్శకుడు వాల్ట్‌డిస్నీలో పనిచేసే స్థాయికి ఎదిగి, సినిమా తీయాలన్న తన లక్ష్యాన్ని 'తంత్ర 'తో సాధించాడు. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్ కలిసి రూపొందించిన ఈ సినిమా ట్రైలర్‌ని త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు నరేష్ బాబు, రవిచైతన్య ప్రకటించారు.
నటీనటులు: అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout