నన్ను ఇష్టపడేవాళ్లు ఫేక్ న్యూస్‌లు చూసి బాధపడకండి: తనీష్
Send us your feedback to audioarticles@vaarta.com
మాదక ద్రవ్యాల కేసులో బెంగుళూరు బాణసవాడి పోలీసులు హీరో తనీష్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ వార్తలపై హీరో తనీష్ స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. నిజానిజాలేమిటో తెలుసుకునేందుకు సైతం కనీసం తనను సంప్రదించలేదని.. కొన్ని ఛానళ్లు మాత్రమే విషయం తెలుసుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించాయన్నాడు. ఇలాంటి వార్తల కారణంగా గతంలో కూడా తన కుటుంబం బాగా ఇబ్బంది పడిందని.. ప్రస్తుతం కూడా అదే ఇబ్బందిని ఎదుర్కొంటోందని తనీష్ తెలిపాడు. ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం కూడా బాగోలేదన్నాడు.
బెంగళూరుకు చెందిన నిర్మాతకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చిన మాట నిజమని, అయితే, తనకు వచ్చిన నోటీసు అర్థమేమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మీడియా ప్రచారం చేయడం సరికాదని తనీష్ పేర్కొన్నాడు. ఫలానా వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిస్తే చెప్పండంటూ తనకు బెంగుళూరు పోలీసులు నోటీసు జారీ చేశారని... తనకు విట్నెస్గా మాత్రమే నోటీసులు జారీ చేశారన్నాడు. గత రెండేళ్లుగా సదరు నిర్మాతతతో తనకు ఎలాంటి సంబంధాలూ లేవని తనీష్ తెలిపాడు. దయచేసి అసత్య ప్రచారం చేయవద్దని తనీష్ కోరాడు. అయితే తనతో సినిమా చేస్తానంటూ గతంలో సదరు నిర్మాత తనను సంప్రదించిన మాట నిజమేనన్నాడు.
అయితే ప్రస్తుతం ఆయనతో ఎలాంటి సంబంధమూ లేదని తనీష్ తెలిపాడు. 2017లో సదరు నిర్మాత శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీకి వెళ్లానని, కానీ ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తనీష్ తెలిపారు. తనకు పంపించిన నోటీసు 67 ఎన్డీపీసీ యాక్ట్ కింద పంపించారని తనీష్ వెల్లడించారు. ఆయనేమైనా తెలుసా.. అన్నట్టుగా పంపించారన్నాడు. కానీ ఏమీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వేశారన్నారు. తాను ఎందరో నిర్మాతల్ని కలిశానని.. అయితే ఎవరేం చేస్తున్నారో తనకెలా తెలుస్తుందన్నాడు. అయితే న్యాయవ్యవస్థపై నమ్మకంతో తాను విచారణకు సహకరిస్తానన్నాడు. నేను 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. దయచేసి మీడియా నన్నొక డాన్‌లాగా క్రియేట్ చేసి వార్తలు వేయవద్దని తనీష్ కోరాడు. నన్ను ఇష్టపడేవాళ్లు ఇలాంటి ఫేక్ న్యూస్‌లు చూసి బాధపడవ్దని కోరాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments