ఏపీ : పది పరీక్షలపై వదంతులు నమ్మొద్దు
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం విదితమే. ప్రస్తుతం 3.0 లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు, సినిమా రీలీజ్‌లు, షూటింగ్స్ బంద్ చేశారు. అంతేకాదు.. ప్రజా రవాణా జరగట్లేదు. పరీక్షలు.. మరీ ముఖ్యంగా టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇంతవరకూ క్లారిటీ కూడా రాలేదు. ఈ తరుణంలో కొన్ని వెబ్ సైట్స్.. కొందరు ఆకతాయిలు ఇదిగో టెన్త్ పరీక్షలు షెడ్యూల్ అంటూ పెద్ద ఎత్తున వార్తలను వైరల్ చేస్తున్నారు. దీంతో అసలు ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలపై షెడ్యూల్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేయగా దీనిపై పాఠశాల విద్యాశాఖ కమీషనర్ చిన వీరభద్రుడు స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా రిలీజ్ చేశారు.
ప్రకటనలో ఏముంది..!?
కోవిడ్-19 లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ పదో తరగతి పరీక్షలు ప్రస్తుతానికి వాయిదా వేసిన విషయం విదితమే. కొంతమంది ఈ నెల 15 నుంచే పది పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అనధికార టైమ్ టేబుల్‌ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వదంతులు సృష్టిస్తున్నారు. వాటిని నమ్మొద్దు. ఇలాంటి వదంతుల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారు. వదంతులు పుట్టించిన.. షేర్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతాం. విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందవద్దు’ అని వాడ్రేవు చినవీరభద్రుడు ప్రకటనలో నిశితంగా వివరించారు.
తెలంగాణలో పది పరీక్షలపై కేసీఆర్ క్లారిటీ..
గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పదో తరగతి పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోనళపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే మీడియా మీట్‌లో క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిబంధనల మేరకు టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలు పెంచి టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని.. భౌతికదూరం పాటిస్తూ, హాళ్లను శానిటైజ్ చేస్తూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఖచ్చితంగా ఈ నెలలోనే టెన్త్ పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ మే-06 నుంచి ప్రారంభమవుతుందని కేసీఆర్ తెలిపారు. ఇవాళ 7 గంటల పాటు సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం సీఎం మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టెన్త్ పరీక్షలపై నిశితంగా చర్చించి.. ఈ నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ తెలిపారు. అదే విధంగా.. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు పరీక్షలుండబోవని ఇదివరకే రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అంటే.. ఎలాంటి సంవత్సర పరీక్షలు లేకుండానే వీరిని నేరుగా తర్వాతి తరగతికి పంపుతారని అర్థం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout