లాంగ్ మార్చ్‌పై అసత్యపు ప్రచారాలు నమ్మొద్దు: పవన్
- IndiaGlitz, [Saturday,November 02 2019]
భవన నిర్మాణ కార్మికులకు అండగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభం కానున్న లాంగ్ మార్చ్‌పై కొందరు పనిగట్టుకుని మరీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. జనసేన తలపెట్టిన ఈ లాంగ్ మార్చ్‌కు అనుమతులు ఇవ్వలేదంటూ పోస్టులు పెడుతున్నారని.. అయితే ఇవి అసత్యపు ప్రచారాలని, వీటిని ఎవరూ నమ్మొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
35 లక్షల భవన నిర్మాణ కార్మికులకు అండగా రేపు జరగనున్న లాంగ్ మార్చ్‌కు విశాఖపట్నం పోలీసులు అనుమతి ఇచ్చారని జనసేనాని తెలిపారు. పార్టీ లీడర్లు, జనసైనికులు, లాంగ్ మార్చ్ మద్దతుదారులు దయచేసి వైసీపీ ప్రభుత్వం అనుమతి లేదంటూ చేస్తున్న అసత్యపు ప్రచారాలు నమ్మవద్దని పవన్ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కొన్ని గంటల క్రితం గుంటూరులో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో చనిపోయిన భవన నిర్మాణ కార్మికుల వివరాలు పవన్ కళ్యాణ్ తెలిపారు.
చనిపోయిన భవన నిర్మాణ కార్మికుల వివరాలు:
1. తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో తాపీ మేస్త్రీ నాగ బ్రహ్మాజి
2. గుంటూరు గ్రామీణ మండలంలోని గోరంట్లలో ప్లంబర్ పోలేపల్లి వెంకటేష్
3. చేబ్రోలు మండలం వేజెండ్ల నాగూర్ వలి
4. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణాలు నిలిచి పనులు దొరకని పరిస్థితి
5. తాడేపల్లి మండలం ఉండవల్లిలో భవన నిర్మాణ కూలీ గుర్రం నాగరాజు
6. పొన్నూరు పట్టణంలో భవన నిర్మాణ కార్మికుడు అడపా రవి