వదంతులను నమ్మకండి.. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది: ఎస్పీ చరణ్

  • IndiaGlitz, [Saturday,August 15 2020]

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరి, కుమారుడు క్లారిటీ ఇచ్చారు. నిన్న బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వైద్యులు బులిటెన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాలు ఆరోగ్యం కుదుటపడాలని కాంక్షిస్తూ ప్రజలతో పాటు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆంకాంక్షించారు. దీంతో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్, సోదరి వసంత ప్రజలకు ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించారు.

‘‘డియర్ ఫ్రెండ్స్, ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులకు మా నాన్నగారి ఆరోగ్య విషయమై మీరు చూపిన శ్రద్ధాసక్తులకు థాంక్స్. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. వదంతులను నమ్మకండి. మేము మీకు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తాం’’ అని చరణ్ తెలిపారు. ‘‘అన్నయ్యకు ఆత్మస్థైర్యం ఉంది. భగవంతుని ఆశీస్సులతో, మీ అందరి ప్రార్థనలతో ఆయన తప్పకుండా ఇంటికి క్షేమంగా వస్తారు. మధ్యాహ్నం అన్నయ్య ఆరోగ్యం క్రిటికల్‌గానే ఉంది. ప్రస్తుతం కోలుకున్నారు. మీ అందరి ప్రార్థనలు ఆయనకి కొండంత అండ..’’ అని ఎస్పీ బాలు సోదరి వసంత అన్నారు.

కరోనా లక్షణాలతో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఈ నెల 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం హాస్పటల్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన అదే రోజు ఓ వీడియోను విడుదల చేశారు. ఇన్ని రోజులపాటు బాగానే ఉన్న ఆయన ఆరోగ్యం గురువారం విషమించిందని.. వెంటనే ఆయనను ఐసీయూకి తరలించి చికిత్సను అందిస్తున్నామని వైద్యులు హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. ఆ తరువాత ఆయన బాగానే ఉన్నట్టు చెబుతున్న ఓ పిక్‌ను కూడా విడుదల చేశారు.

More News

బాలు.. త్వరగా లేచిరా!  నీ కోసం కాచుకుని కూర్చున్నాను:  ఇళ‌య‌రాజా

గానగంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం కోవిడ్ 19 కార‌ణంగా ఆగ‌స్ట్ 5న చెన్నై ఎంజీఎం హాస్పిట‌ల్‌లో జాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఏపీలో కొత్తగా 8943 కరోనా కేసులు..

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీకి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది.

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్‌..!!

ఒక వైపు ద‌ర్శ‌క‌త్వంతో పాటు నిర్మాణంలో చురుకుగా ఉండే వ్య‌క్తుల్లో జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఒక‌రు. య‌న్టీఆర్ క‌థానాయ‌కుడు,

ఏపీలో ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే...

ప్రవేశ పరీక్షలపై ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు పరీక్షల తేదీలను కూడా వెల్లడించింది.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమం..

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 5న ఆయనకు కరోనా సోకింది.