షాకయ్యా.. దయచేసి నా మీద దాడి చేయొద్దు మోదీ!!

  • IndiaGlitz, [Wednesday,May 08 2019]

ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు ఎవరెవరో తెరపైకి వస్తారు.. అసలు పత్తాలేని వాళ్లంతా పాలిటిక్స్ అంటూ కండువా కప్పుకొని తిరిగేస్తుంటారు. ఇక టికెట్స్ దక్కించుకున్న నేతలైతే తాను గెలిస్తే, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామన్నది పక్కనెట్టేసి.. పక్కనోళ్లు విషయాలు చెప్పడానికి సగం టైమ్ గడిపేస్తుంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా జాతీయ పార్టీల విషయానికొస్తే కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు.. బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు అంతే అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామని చెప్పేది మాత్రం నిల్.. మిగిలినవన్నీ ఫుల్! ఒక్క మాటలో చెప్పాలంటే మూడు విమర్శలు.. ఆరు వివాదాలతో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి సాగుతోంది.! ఒకర్నొకరు తిట్టుకోవడం.. మన మధ్యలోని మనుషుల పేర్లెత్తి మరీ విమర్శించడం.. ఒకరేమో బూతులు తిడుతూ ఎన్నికల కమిషన్‌తో మొట్టికాయలు తినడం.. ఇలా సాగిపోతోంది.

అసలు సంగతేంటి..!?

ఇక అసలు విషయానికొస్తే.. బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా రాజీవ్, ఇందిరా, సోనియా, ప్రియాంక, రాహుల్, రాబర్ట్ వాద్రా పేర్లే వినిపిస్తుంటాయ్. మరీ ముఖ్యంగా ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరు మాత్రం రోజుకోసారయిన తలచుకోనిదే బీజేపీ నేతలకు నిద్రపట్టదేమో కానీ... ప్రతీరోజు ఆయన పేరుండాల్సిందే మరి. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే ఎన్నికల ప్రచారంలో తన పేరు ప్రస్తావించడంతో ప్రతి దాంట్లోనూ తనను ఎందుకు లాగుతారంటూ వాద్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానిపై వాద్రా ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు తనను ఎన్నిసార్లు విచారించినా, నోటీసులు ఇచ్చినా తన మీద చేసిన ఒక్క ఆరోపణ కూడా రుజువు కాలేదన్న విషయాన్ని రాబర్ట్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసలు దేశంలో ఎన్నో సమస్యలున్నాయని వాటన్నింటినీ వదిలేసి కేవలం తనను మాత్రమే టార్గెట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని.. పదే పదే తనపేరు ప్రచారంలో వస్తుండటంతో షాకయ్యాను దయచేసి తన మీద దాడి చేయొద్దు మోదీగారు అంటూ వాద్రా ఓ లేఖ రాశారు..!

వాద్రా లేఖ సారాంశం...

మోదీగారు.. మీ ఎన్నికల ర్యాలీలో మళ్లీ నా పేరు వినిపించడంతో నేను షాకయ్యాను. దేశంలో పేదరికం, మహిళా సాధికారత, నిరుద్యోగం లాంటి ఎన్నో సమస్యలున్నాయి. వాటన్నింటినీ వదిలేసి మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. గత ఐదేళ్లుగా మీ ప్రభుత్వం నన్ను వేధిస్తూనే ఉంది.. ఇప్పటికే కోర్టులు, ఐటీ, ఈడీ లాంటి ప్రభుత్వ సంస్థలు, ఇతర ఏజెన్సీల నుంచి వరుసగా నోటీసులు పంపి నన్ను మానసికంగా ఒత్తిడి చేయాలని చూశారు. ఇప్పటి వరకూ ఒకట్రెండు కాదు ఏకంగా 11 నోటీసులు పంపారు. ఈడీ లాంటి సంస్థలు నన్ను 8 గంటల నుంచి 11 గంటల పాటు నన్ను ప్రశ్నించారు. దేశంలోని వివిధ నగరాల్లో నా మీద విచారణ జరిపించారు. అయినా, ఒక్కదాంట్లో కూడా నా మీద ఆరోపణలను రుజువు చేయలేకపోయారు. పదే పదే నా మీద ఆరోపణలు చేయడం ద్వారా మీరు ఏం సాధించారో కానీ నాకైతే ఆశ్చర్యంగా ఉంది. దయచేసి నా మీద వ్యక్తిగత దాడి ఆపండి. అలాంటి వ్యాఖ్యలు చేసి గౌరవ న్యాయవ్యవస్థను కించపరచొద్దు. నాకు భారతీయ న్యాయవ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. నిజం గెలుస్తుంది.. ఈ దేశ ప్రజలను ఆ దేవుడే కాపాడాలి అని రాబర్ట్ వాద్రా లేఖలో ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తూ మోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు.

కాగా.. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాబర్ట్ వాద్రాను జైలుకు పంపిస్తామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి లోనైన వాద్రా పై విధంగా లేఖ రూపంలో మోదీపై కౌంటర్‌ ఎటాక్ చేశారు.

More News

'కీ' ... తెలుగు, తమిళ భాషల్లో మే 11న విడుదల

రంగం` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరో జీవా క‌థానాయ‌కుడిగా సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో రూపొందుతోన్న సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ `కీ`.

మహేశ్‌ను ఒప్పించాడు.. 27వ మూవీ ఆ డైరెక్టర్‌తోనే!?

సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు 25వ చిత్రం 'మహర్షి' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై అభిమానులు, మహేశ్, ముగ్గురు నిర్మాతలు, డైరెక్టర్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు.

ఐటీ దాడులు, టికెట్ల ధరలు పెంపుపై దిల్‌రాజు స్పందన

సూపర్‌‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే జంటగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మరికొన్ని గంటల్లో అభిమానుల ముందుకు మహర్షి రాబోతున్నాడు.

మే 10 న 'యురేక' టీజర్ విడుదల....!!

ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'యురేక'..  కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు..

జూలై 26న 'డియ‌ర్ కామ్రేడ్‌' రిలీజ్

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్`.