భయపడకండి.. ఆగస్ట్ 15కు మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇది నిజంగా ప్రజానీకానికి గుడ్ న్యూసే.. కరోనా భయంతో అల్లాడుతున్న ప్రజానీకానికి అద్భుతమైన వరం. భారత్ బయోటెక్ సంస్థ ఇచ్చిన మాట నిలుపుకుంది. ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్‌ను మార్కెట్‌లో ఉంచబోతోంది. ఈ మేరకు అన్ని పర్మిషన్లను భారత్ బయోటెక్ తెచ్చేసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చేసింది.
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవాలని ప్రపంచమంతా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏ దేశం నుంచి వ్యాక్సిన్ ముందుగా వస్తోందో తెలియని పరిస్థితి. కానీ భారత్ బయోటెక్ మాత్రం ముందే డేట్‌ను కూడా ఫిక్స్ చేసేసింది. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజునే అందరికీ కరోనా నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పింది. కానీ భారత్ బయోటెక్ సంస్థ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించడానికి ముందే రష్యా క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసేసింది. దీంతో ఆ దేశం నుంచి వ్యాక్సిన్ ముందుగా రిలీజ్ అవుతుందేమోనని అంతా భావించారు.
అయితే అనూహ్యంగా ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్ 15 నుంచి వ్యాక్సిన్‌ను మార్కెట్‌లో ఉంచేందుకు భారత్ బయోటెక్ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కూడా తీసుకుంది. ఇది నిజంగా దేశానికే గర్వకారణం. ముఖ్యంగా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికే చాటి చెప్పే న్యూస్‌ని భారత్ బయోటెక్ అందించింది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్‌ను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఇప్పటి వరకైతే ఎటువంటి దుష్పరిణామాలూ చోటు చేసుకోలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout