హైదరాబాద్ జుమాటో డెలివరీ బాయ్ కోసం విరాళాలు.. హృదయాలు కదిలించేలా..
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ లో ఓ జుమాటో డెలివరీ బాయ్ విషయంలో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరు హృదయాలు హద్దుకుంటోంది. మన కళ్ళ ముందు ఎందరో పేదవాళ్ళు ఉంటారు. కానీ వారిని ఆదుకోవాలనే ఆలోచన కొందరికే కలుగుతుంది. ఇది కూడా అలాంటి విషయమే.
ఇదీ చదవండి: బ్రేకింగ్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ గా సత్య నాదెళ్ల.. శిఖరాగ్రాన తెలుగు తేజం!
జూన్ 14న రాబిన్ ముఖేష్ అనే హైదరాబాద్ యువకుడు జూమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అతడు నివాసం ఉంటున్నది కింగ్ కోటిలో. 20 నిమిషాలలో అతడి ఫుడ్ డెలివరీకి వచ్చేసింది. తన ఫుడ్ తీసుకునేందుకు ముఖేష్ బయటకు రాగా డెలివరీ బాయ్ ని చూసి ఆశ్చర్యపోయాడు.
ఆ డెలివరీ బాయ్ వచ్చింది సైకిల్ లో. అది చూసి ముఖేష్ కు ఆశర్యం వేసింది. ఆ డెలివరీ బాయ్ పేరు మహమ్మద్ అఖీల్. అఖీల్ ఫుడ్ డెలివరీ చేసేందుకు కనీసం 10 కిమీ ప్రయాణించాలి అని ముఖేష్ కు అర్థం అయింది. సైకిల్ లో వచ్చినప్పటికీ ఆలస్యం కాకుండా డెలివరీ చేశాడు. దీనితో ముఖేష్ కు అఖీల్ గురించి తెలుసుకోవాలి అనిపించింది. అఖీల్ ఆర్థిక పరిస్థితి విన్న ముఖేష్ చలించిపోయాడు.
కనీసం బైక్ కొనుక్కోలేని స్థితిలో అఖీల్ ఉన్నాడు. దీనితో అఖీల్ కు సాయం చేయాలి అని ముఖేష్ డిసైడ్ అయ్యాడు. ముఖేష్ ఫేస్ బుక్ ఫుడ్ గ్రూప్ లో యాక్టివ్ మెంబర్. ఆ గ్రూప్ లో అఖీల్ గురించి రాశాడు. ఈ పోస్ట్ కు విశేష స్పందన వచ్చింది. అఖీల్ కు బైక్ కొనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ సాయం చేయాలని ముఖేష్ గ్రూప్ మెంబర్స్ ని కోరాడు. 60 వేల వరకు డబ్బు సేకరించి అఖీల్ కు బైక్ కొనివ్వాలనేది ముకేశ్ ఆలోచన.
ముఖేష్ ఊహించిన దానికంటే తక్కువ టైంలోనే 60 వేలు సేకరించబడ్డాయి. అంతకంటే ఎక్కువగానే మొత్తం రూ 73 వేలు విరాళాలు ముఖేష్ కు అందాయి. దీనితో అఖీల్ కు ఓ టీవీఎస్ బైక్ ఆర్డర్ చేశాడు. ఒకటి రెండు రోజుల్లో అఖీల్ కు బైక్ డెలివరీ కానుంది. మిగిలాం మొత్తంతో అఖీల్ కు రైన్ కోట్, హెల్మెంట్, కాలేజీ ఫీజుకు సాయం అందించారు. అఖీల్ కోసం ముఖేష్ పడ్డ తపనకు ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout