రూ.30 కోట్లు దానం చేసి ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచింది..
Send us your feedback to audioarticles@vaarta.com
నాలుగు నెలల్లో చేతికి ఎముకలేదన్నట్టుగా రూ.30 కోట్లు దానం చేసింది. అయినా కూడా ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మహిళల లిస్టులో అగ్ర స్థానంలో నిలిచింది. ఆమె మరెవరో కాదు.. అపర కుబేరుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్. వీరిద్దరూ విడిపోయే సమయంలో జెఫ్ బెజోస్.. ఆమెకు భరణంగా నాలుగు శాతం ఆస్థిని ఇచ్చారు. అయితే దానిని ఆమె మరింత పెంచుకునేందుకు చూడలేదు. దానిలో కొంత దాన ధర్మాలకు వినియోగించాలని భావించింది.
కరోనా కారణంగా దెబ్బతిన్న కోట్లాది మంది జీవితాలను ఆదుకోవాలని మెకంజీ భావించారు. అనుకున్నదే తడవుగా ప్రజలకు సాయంగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థల లిస్టును ఆమె తెప్పించుకున్నారు. వాటికి ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్నారు. అయితే కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే మెకంజీ చేసిన ఆర్థిక సాయం రూ.30 కోట్లు కావడం విశేషం. షాకింగ్‌గా అనిపించినా అది నిజం. అయినప్పటికీ ఆమె అత్యధిక సంపద కలిగిన మహిళల లిస్టులో అగ్రస్థానంలో నిలిచారు.
ఈ విషయమై మెకంజీ మాట్లాడుతూ.. ‘‘అమెరికన్ల జీవితాల్ని కరోనా మహమ్మారి దుర్భరం చేసేసింది. ఇదే సమయంలో కోటీశ్వరుల సంపద అనూహ్యంగా అంటే 80% మేర పెరిగింది. అందుకే ప్రజలకు సాయంగా నిలుస్తున్న 384 స్వచ్ఛంద సంస్థల్ని గుర్తించి, ఆర్థికసాయం అందిస్తున్నా. ఆకలిని, పేదరికాన్ని దూరం చేసేందుకే ఈ ప్రయత్నం’’ అని పేర్కొన్నారు. అయితే మెకంజీ ఆస్తి విలువ తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఆమె ఆస్తి విలువ.. సుమారు 4.1లక్షల కోట్లు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments