స్వింగ్ రాష్ట్రాలు.. ట్రంప్ వెంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌లో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. క్షణక్షణానికి ఫలితం మారిపోతోంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రటి అభ్యర్థి జో బైడెన్‌ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. విజయానికి కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో మాత్రం ట్రంప్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ప్రస్తుతానికి అరిజోనా, న్యూహాంప్‌షైర్ మినహా మిగిలిన అన్ని చోట్లా ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. కాగా.. అర్బన ఓటర్లంతా మాత్రం బైడెన్ పక్షానే నిలిచారు. ప్రస్తుతానికి బైడెన్ 227 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించగా.. ట్రంప్ 210 ఓట్లు సాధించారు.
అమెరికాలోని అర్బన్ ఓటర్లంతా బైడెన్ పక్షానే నిలిచారు. దీంతో న్యూయార్క్, వాషింగ్టన్, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో డెమొక్రాటిక్ పార్టీకి తిరుగులేని విజయం లభించింది. కాగా. రిపబ్లికన్ పార్టీ ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ట్రంప్ ఆధిపత్యం కొంత తక్కువగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఫ్లోరిడా రాష్ట్రంలో బైడెన్ జయకేతనం ఎగురవేస్తారని విశ్లేషకులు, మీడియా స్పష్టం చేశాయి. కానీ విశ్లేషకులు, మీడియా అంచనాలు తలకిందులవుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఇక్కడ ట్రంప్ 51.2శాతం ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. బైడెన్‌కు 47.8శాతం ఓట్లు పోలయ్యాయి. ఇద్దరి మధ్య దాదాపు 4శాతం ఓట్ల తేడా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout