LPG Cylinder Price : సామాన్యులకు కేంద్రం మరో షాక్.. మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెంపు, ఎంతో తెలుసా..?

  • IndiaGlitz, [Wednesday,July 06 2022]

పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు ప్రస్తుతం దేశంలో బతకలేని పరిస్ధితి నెలకొంది. అయినప్పటికీ కేంద్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా వంట గ్యాస్ ధరల్ని మరోసారి పెంచింది. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై రూ.50 పెంచింది కేంద్రం . దీనితో పాటు 5 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరను కూడా రూ.18 మేర పెంచింది ప్రభుత్వం. కొత్త ధరల కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.1053కి చేరింది. నిన్నటి వరకు దీని ధర రూ.1003గా వుండేది. అటు హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1055 నుంచి రూ.1105కి చేరుకుంది. జూలై 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ.183.50 మేర తగ్గించాయి. అలాగే ఈ రోజు కూడా వాణిజ్య సిలిండర్ ధర ను రూ.8.50 మేర తగ్గించింది కేంద్రం. సవరించిన ధరలు ఈ రోజు నుంచే అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.

అచ్చెదిన్ ఆగయా అంటూ కేటీఆర్ సెటైర్లు:

మరోవైపు వంట గ్యాస్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అటు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం గ్యాస్ ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అచ్చెదిన్ ఆగయా.. చప్పట్లు కొట్టండి’’ అంటూ ప్రధాని మోడీపై పరోక్షంగా సెటైర్లు వేశారు. గృహ వినియోగదారులకు మోడీ సర్కార్ ఇచ్చిన గిఫ్ట్ అంటూ దుయ్యబట్టారు. దీనితో పాటు ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో 35 శాతం ఇళ్లు అక్రమంగా నిర్మించినవే అంటూ ఓ జాతీయ పత్రికలో వచ్చిన వార్తను ఆయన మరో ట్వీట్ చేశారు. మరి గుజరాత్ కు బుల్డోజర్లు వస్తాయా అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. గత కొంతకాలంగా యూపీ, మధ్యప్రదేశ్‌లలోని అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు అక్కడి అధికారులు. దీనిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ఇలా స్పందిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

More News

Coronavirus: దేశంలో విస్తరిస్తోన్న కరోనా.. కొత్తగా 16,159 మందికి పాజిటివ్, పెరుగుతోన్న యాక్టీవ్ కేసులు

ప్రపంచవ్యాప్తంగా నెమ్మదించింది అనుకున్న కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

AIIMS Mangalagiri: రూ.10కే కార్పోరేట్ వైద్యం.. పేదల పాలిట సంజీవనీలా మంగళగిరి ఎయిమ్స్

భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఆసుపత్రుల్లో ఎయిమ్స్ కూడా ఒకటి. రాష్ట్రపతి, ప్రధాని , కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల వంటి రాజకీయ ప్రముఖులు అనారోగ్యానికి గురైతే తక్షణం అక్కడికే తరలిస్తారు.

Alia Bhatt: ఫస్ట్ నైట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన అలియా.. షాకైన కరణ్ జోహార్, వీడియో వైరల్

యుక్త వయసుకు రాగానే.. యువతీ యువకులు తమకు కాబోయే జీవిత భాగస్వామి ఇలా వుండాలి..

Janasena Party : సమస్యలుంటే జనం చూపు ‘‘జనసేన’’ వైపే .. అండగా నిలుస్తాం : నాగబాబు

ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన ప్రధాన ధ్యేయమని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేసే వారిని, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరి సేవలను పార్టీ గౌరవిస్తుందన్నారు

Editor Gowtham Raju: ఎడిటర్ గౌతంరాజు కన్నుమూత.. శోక సంద్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు.