మరింత ప్రియం కానున్న దేశీయ విమాన ప్రయాణం

  • IndiaGlitz, [Saturday,May 29 2021]

దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. విమానయాన ఛార్జీల దిగువ పరిమితిని జూన్‌ 1 నుంచి 13 - 16 శాతం పెంచుతూ శుక్రవారం పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఎగువ పరిమితిలో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదు. కేంద్రం ఉత్తర్వుల మేరకు.. 40 నిమిషాల విమాన ప్రయాణానికి ఛార్జీల దిగువ పరిమితి రూ. 2,300 నుంచి రూ. 2,600లకు పెరుగగా, 40-60 నిమిషాల ప్రయాణానికి దిగువ పరిమితి ఛార్జీ ప్రస్తుతం రూ. 2,900 ఉండగా అది రూ. 3,300కి పెరగనుంది.

ఇక 60-90 నిమిషాల ప్రయాణానికి రూ.4000, 90-120 నిమిషాల ప్రయాణానికి రూ.4700, 120-150 నిమిషాల ప్రయాణానికి రూ.6100, 180-210 నిమిషాల ప్రయాణానికి 8700 దిగువ పరిమితిగా ఉండనుంది. అలాగే జూన్ 1వ తేదీ నుంచి 50 శాతం విమానాలను మాత్రమే నడపాలని కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ప్రస్తుత నిబంధనల ప్రకారం సంస్థలు 80 శాతం సామర్థ్యంతో నిర్వహించుకునేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ వీలు కల్పించింది.

More News

నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే డాక్టర్ దంపతుల హత్య

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారుని అడ్డగించి డాక్టర్ దంపతులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన ఘటన రాజస్థాన్‌లో కలకలం రేపుతోంది.

పవన్ సినిమాలో బాలీవుడ్ హీరో, హీరోయిన్.. ఎంట్రీ ఎప్పుడంటే ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం హరిహర వీరమల్లు. షూటింగ్ దశలోనే ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

విరించితో పాటు మరో 4 ఆసుపత్రుల కొవిడ్ చికిత్స లైసెన్స్ రద్దు

విరించి హాస్పిటల్‌ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వంశీకృష్ణ అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా లక్షల్లో ఫీజు వేయడంతో అంత ఫీజు ఎలా అయ్యింది?

వేగాన్ మిల్క్‌ను అభివృద్ధి చేయండి: అమూల్‌కు పెటా వినతి

వేగాన్ మిల్క్‌ను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలని పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్(PETA) ఇండియా అమూల్ సంస్థని కోరింది. పెటా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ శోధి..

14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు నోటీసులు.. శర్వానంద్ కోపానికి కారణం అదేనా?

యంగ్ హీరో శర్వానంద్ నటనా ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ముఖకవళికలతోనే అన్ని భావాలని పలికించగల నటుడు శర్వానంద్.