రాజమౌళి కుటుంబానికి సినీ కార్మికుల గోడు పట్టదా?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచమంతా కరోనా వైరస్(కోవిడ్ 19) ప్రభావంతో విలవిలలాడుతోంది. సినీ రంగం విషయానికి వస్తే.. షూటింగ్స్ ఆగిపోయాయి. దీని వల్ల స్టార్స్‌కు వచ్చిన సమస్యలేమీ లేవు. వచ్చిన సమస్యలంతా రోజువారీ కార్మికులకే. షూటింగ్స్‌పైనే ఆధారపడి బ్రతికే వారి కుటుంబాలు ఆకలితో, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి అధ్యక్షతన ‘సీసీసీ మనకోసం’ అనే సంస్థను ఏర్పాటు చేశారు సినీ పెద్దలు. మెగా హీరోలే కాదు.. ఎంటైర్ సినిమా పరిశ్రమలో దర్శకులు, నిర్మాతలు కూడా ఈ సంస్థకు తమ వంతుగా విరాళాలను అందచేస్తున్నారు. అయితే అసలు తమకేం పట్టనట్లు ఉన్నది మాత్రం రాజమౌళి అండ్ ఫ్యామిలీ.
బాహుబలి వంటి గొప్ప సినిమాను తీసిన దర్శకుడు రాజమౌళి ఇప్పుడు మరో భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగిన ఈ దర్శకుడు.. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్. ఆయనతో సినిమా చేయాలని హీరోలే కాదు.. నిర్మాతలు కూడా ఊవ్విళ్లూరుతుంటారు. ప్రతి సినిమా కోసం భారీ మొత్తంలో ఫ్యామిలీ ప్యాకేజీలు తీసుకుని రాజమౌళి అండ్ ఫ్యామిలీ సినిమాలు చేస్తారని ఇండస్ట్రీలో లుకలుకలు వినపడుతుంటాయి. అంత భారీ మొత్తంలో ప్యాకేజీలు అందుకునే వారికి కార్మికుల కష్టం కనపడటం లేదా? అనే ప్రశ్న అందరి మదిని తొలుస్తుంది. కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు కాస్తో కూస్తో విరాళమిచ్చేంత మనసు రాజమౌళి అండ్ ఫ్యామిలీకి లేదా? అసలు గుర్తుకు రాదా? అని గుసగుసలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments