ఆ క్రెడిట్ ఎన్టీఆర్‌కే దక్కనుందా?
- IndiaGlitz, [Tuesday,March 31 2020]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేటి తరం హీరోల్లో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. ఇంతకూ ఏమీటా ఘనత అనుకునే వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా ఈ సినిమా టీజర్‌తో పాటు చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వీడియోకు తారక్ వాయిస్ ఓవర్‌ను అందించాడు. ఈ వీడియో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. ఇందులో మలయాళం మినహా మిగతా అన్నీ భాషల్లో తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.
ఈ వీడియో తారక్ వాయిస్ అద్భుతంగా ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. తారక్ స్పీడు చూస్తుంటే డబ్బింగ్ కూడా ఇలాగే చెప్పేలా ఉన్నాడు. అయితే ఇలా ఓకే స్టైల్లో పాన్ ఇండియాకు డబ్బింగ్ చెప్పుకునే నేటి తరం హీరోగా తారక్ నిలవబోతున్నాడు. రజినీకాంత్, కమల్ హాసన్, ప్రకాశ్‌రాజ్ వంటివారు అలాగే అన్నీ భాషల్లో డబ్బింగ్ చెప్పుకున్నారు.. చెబుతున్నారు కూడా. ఇప్పుడు వీరి బాటలోనే తారక్ అడుగు పెట్టబోతున్నాడు. మరి మే 20న తారక్ వీడియో రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌లో విడుదలవుతుందని అంటున్నారు. మరి చరణ్ కూడా అన్నీ భాషల్లో డబ్బింగ్ చెబుతాడో లేదో? చూడాలి.