కరోనా భయంతో మాస్క్ పెట్టుకోవడం అవసరమా!?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కరకంగా జాగ్రత్తలు చెబుతుండటం.. మరోవైపు ఇవి వాడండి.. అవి వాడండి అని చెబుతుండటంతో జనాలు తికమకపడుతున్నారు. ఇలాంటివి ప్రజల్లో చాలానే అపోహలున్నాయి. మరీ ముఖ్యంగా మాస్క్ విషయంలో డాక్టర్లు సైతం చిత్ర విచిత్రాలుగా చెబుతున్నారు. ఒకరేమో సాధారణ మాస్క్ అయినా సరిపోతుందని..? మరొకరేమో కచ్చితంగా ఎన్-95 మాత్రమే వాడాలని చెబుతున్నారు. అయితే అసలు మాస్క్‌లు, శానిటైజర్లు మనల్ని ఏ మాత్రం కరోనా నుంచి కాపాడుతుంది..? అసలు మాస్క్ వల్ల ప్రయోజనమేంటి..? అనే విషయాలు ప్రముఖ వైద్య నిపుణుడు ద్వారా తెలుసుకుందాం.
వీళ్లు మాత్రమే..!
‘మాస్క్ పెట్టుకుంటే బాగుంటుంది కానీ.. కరోనా వైరస్ చేరేది.. నివసించేది కూడా ఊపిరితిత్తుల్లోనే. మనిషిని చంపడానికి కూడా ఈ అవయవాన్నే ఎంచుకుంటుంది. అయితే మాస్క్ పెట్టుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా కాపాడుకుంటామనే ఒక ఆలోచన ఉంది కానీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం సాధారణ మాస్క్‌లు కాపాడలేవని.. ఎన్-95 మాత్రమే కాపాడుతుందని చెబుతోంది. అసలు ఎవరు పెట్టుకోవాలి ఈ మాస్క్. హెల్త్‌కేర్ ప్రొఫిషనల్స్ మాత్రమే దీన్ని వాడాలి. ఎందుకంటే పొద్దున లేచినప్పట్నుంచి ప్రతి నాలుగైదు అడుగుల దూరంలో ఉండే రోగులను పట్టుకుని చూస్తుంటారు కాబట్టి వాళ్లు వాడాలి. రోగులు దగ్గుతుంటారు.. వారి నుంచి డాక్టర్ కాపాడబడాలి కాబట్టి ఎన్-95 అనే మాస్క్ ఎక్కువ రిస్క్ ఉన్నవాళ్లు మాత్రమే పెట్టుకోవాలి’ అని వైద్యనిపుణులు చెబుతున్నారు.
సామాన్యుడికి అక్కర్లేదు ఎందుకంటే..!
‘సామాన్య ప్రజానికానికి ఎన్-95 అనేది అస్సలు అక్కర్లేదు. మీరు హై రిస్క్ గ్రూపులో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. ప్రతి సారి మాస్క్‌ను అడ్జస్ట్ చేసుకోవడం.. ఇలా అలా తిప్పడం ద్వారా గోళ్లు, వేళ్లకు ఉండే వైరస్ అనేది మాస్క్ ద్వారా లోపలికి వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి. మాస్క్ ఒక్కసారి కట్టుకున్న తర్వాత పదే పదే ఇక దాన్ని ముట్టుకోకూడదు. మాస్క్ వేసుకునే శానిటైజర్‌తో శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాదు మాస్క్ వేసుకున్న తర్వాత కూడా మళ్లీ శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలి. బయటికి వెళ్లొచ్చిన తర్వాత కూడా మళ్లీ కడుక్కోవాలి. మాస్క్ తీసిన తర్వాత కూడా మళ్లీ చేతులు కడుక్కోవాలి. సాధారణ మనిషి ఇన్ని చేయగలడా..? సాధారణమైన వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఇన్ని చేయగలడా..? అందుకే మాస్క్ అనేది అందరికీ అవసరమా అంటే అక్కర్లేదు. హై రిస్క్ ఉన్నవారికి మాత్రమే వాడాలి. ఎవరింట్లో అయినా అనుమానిత కేసు ఉంటే మాత్రం కచ్చితంగా మాస్క్‌లు ధరించాలి.. ఆయనతో పాటు ఇంట్లో అందరూ కూడా వాడాలి’ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments